logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

సుశాంత్ ప్రేయసి రియా చక్రబర్తి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్యను ఆయన అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ లోని పెద్దలను, స్టార్ కిడ్స్ ను నేపోటిజం పేరుతో కడిగి పారేస్తున్నారు. కొందరు మాత్రం సుశాంత్ ది అసలు ఆత్మహత్య కాదని హత్యే అంటూ వాదిస్తున్నారు. కాగా ఈ కేసులో ముంబై పోలీసులు ఇప్పటికే 13 మంది వాంగ్మూలాన్ని రికార్డు చేసారు.

మరోవైపు సుశాంత్ సింగ్ ప్రేయసి రియా చక్రబర్తిపై ఇప్పటికే భారీ ఎత్తున విమర్శలు ఎదురవుతున్నాయి. రియా నిర్మాత మహేష్ భట్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. మహేష్ భట్ తో రియా సంబంధం కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సుశాంత్ ను వదిలేయాలని లేకుంటే చంపేస్తామంటూ ఆమెను బెదిరింపులు వచ్చాయంటూ కూడా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సుశాంత్ ఆత్మహత్యపై మహేష్ భట్ స్పందిస్తూ.. అతను ఆత్మహత్య చేసుకుంటాడని ముందే ఊహించానని చెప్పడం సుశాంత్ అభిమానులకు మరింత ఆగ్రహం తెప్పించింది.

ఈ నేపథ్యంలో ఇప్పటికే రియాను పోలీసులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. అయితే సుశాంత్ సొంత రాష్ట్రమైన బీహార్ కు చెందిన అతని అభిమాని రియాపై ఏకంగా పోలీసు కేసు నమోదు చేసాడు. సుశాంత్ ఆత్మహత్య కేసులో రియా పాత్రపై విచారణ జరపాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. రియాతో పాటుగా ఇప్పటికే బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, నిర్మాత కరణ్ జోహార్, ఏక్తా కపూర్తో పాటు పలువురిపై సుశాంత్ అభిమానులు కేసు నమోదు చేసారు.

Related News