logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

కార్డు లేకుండానే ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేయొచ్చు.. ఎలాగో తెలుసుకోండి!

సాధారణంగా మనం ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేయాలంటే మన దగ్గర కచ్చితంగా ఆ బ్యాంకుకు సంబందించిన ఏటీఎం ఉండాల్సిందే. కార్డును ఏటీఎం లో స్వైప్ చేసి పిన్ నంబర్ ఇస్తేగాని మన చేతికి డబ్బు రాదు. లేదంటే ఆన్లైన్ ట్రాన్సక్షన్స్ చేసుకోవడం తప్ప వేరే దారి లేదు. కానీ ఇప్పుడు బ్యాంకు కస్టమర్ల కోసం కొత్త ఫీచర్ రాబోతుంది. అంటే ఇకపై డెబిట్ కార్డు అవసరం లేకుండానే ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎన్సీఆర్ కార్పొరేషన్ అనే సంస్థ తొలిసారిగా ఇంటర్ ఆపరబుల్ కార్డ్ లెస్ క్యాష్ విత్ డ్రాయెల్ సర్వీసులను ఆవిష్కరించింది. ఈ కొత్త సేవల వల్ల ఎవరైనా ఏటీఎం నుంచి డెబిట్ కార్డు లేకుండానే ఏటీఎం పై ఉన్న క్యూర్ కోడ్ ను స్కాన్ చేసి డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ సంస్థతో సిటీ యూనియన్ బ్యాంకు ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ సేవలు మొదటగా ఈ బ్యాంకు కస్టమర్లకు అందుబాటులోకి రానున్నాయి. ఈ బ్యాంకు తొలి విడతగా 1500 ఏటీఎంలను ఈ కొత్త ఫీచర్ తో అప్ గ్రేడ్ చేయనుంది. ఆ తర్వాత ఈ సేవలను ఇతర బ్యాంక్ కస్టమర్లకు కూడా విస్తరించే అవకాశం ఉంది.

ఈ ఫీచర్ ఎలా పని చేస్తుందంటే.. డబ్బులు డ్రా చేసుకోవాలని భావించేవారు ముందుగా ఫోన్ లో యూపీఐ యాప్ ను ఓపెన్ చేయాలి. అందులో గూగుల్ పే టీఎం, అమెజాన్, గూగుల్ పే లాంటి యాప్స్ ను ఓపెన్ చేయాలి. అందులో స్కానర్ ను ఉపయోగించి ఏటీఎం పైన ఉన్న క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేయాలి. ఇప్పుడు మీ ఫోన్ లో ఎంత డబ్బులు కావాలో ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ పిన్ నంబర్ ను ఎంటర్ చేసి ప్రొసీడ్ పై క్లిక్ చేయగానే ఏటీఎం నుంచి డబ్బులు వస్తాయి. ఈ విధంగా మీరు డెబిట్ కార్డు లేకుండా రూ. 5 వేల వరకు డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉన్న ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే డబ్బులు డ్రా చేసుకోవడానికి ఇబ్బంది పడే అవసరముండదు. ఒక వేళ కార్డు మర్చిపోయినా ఫోన్ ఉంటె సరిపోతుంది. ఇప్పటికే ఎస్బీఐ యోనో యాప్ ద్వారా తమ కస్టమర్లకు ఈ సేవలను అందిస్తుంది.

Related News