logo

హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జిపై కారు బోల్తా..!

హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై కారు ప్రమాదం చోటుచేసుకంది. మాదాపూర్ నుంచి బంజారాహిల్స్ వెళ్తున్న వాహనం కారు టైర్ పంక్చర్ కావడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో అదృష్టవశాత్తు కారులో ఉన్న ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన ట్రాఫిక్ పోలీసులు హుటాహుటిన వచ్చి సహాయక చర్యలు చేపట్టారు.

ఈ ఘటనతో వాహనదారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే ప్రమాదం కారణంగా భారీగా ట్రాఫిక్ కు అంతరాయం కావడంతో ప్రమాదానికి గురైన కారును ప్రస్తుతం అక్కడి నుంచి తొలగిస్తున్నారు పోలీసులు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.

Related News