logo

  BREAKING NEWS

క‌రోనా బాధితుల‌కు గ్రీన్ ఫంగ‌స్ ముప్పు..లక్ష‌ణాలు, జాగ్ర‌త్త‌లు ఇవే  |   FACK CHECK: క‌రోనా వ్యాక్సిన్ వేసుకుంటే శ‌రీరం అయ‌స్కాంతం అవుతుందా ?  |   కేతిరెడ్డికి జ‌గ‌న్ బంప‌ర్ ఆఫర్.. షాక్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు  |   క‌రోనా వ్యాక్సిన్ వేసుకున్నాక ఈ ప‌నులు అస్స‌లు చేయ‌కండి  |   గుడ్ న్యూస్‌.. ఆ వ్యాక్సిన్ సామ‌ర్థ్యం 90 శాతం  |   నెయ్యి తింటే లావుగా అవుతారా ? నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాదా ?  |   అరుదైన రికార్డు సొంతం చేసుకోనున్న బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి  |   కేసీఆర్ మాస్ట‌ర్‌స్ట్రోక్‌.. హుజురాబాద్‌లో ఈట‌లకు క‌ష్ట‌మే  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వేరు జెండా.. కుప్పంలో కొత్త డిమాండ్‌  |   పెట్రోల్‌లో 20 శాతం ఇథ‌నాల్‌.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర.. మ‌రెన్నో లాభాలు  |  

‘నా గతం గుర్తుచేశారు’.. తన బయోపిక్ పై మొదటిసారి స్పందించిన గోపినాథ్

సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆకాశం నీ హద్దురా’. కెప్టెన్ జీఆర్ గోపినాథ్ ఆటో బయోగ్రఫీ ‘సింప్లి ఫ్లై’ అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. కాగా తెలుగులో అంతగా అంచనాలు లేకుండా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

సూర్య నటన, సుధా కొంగర టేకింగ్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇప్పుడు ఈ సినిమా చూసినవారంతా దీనిపై కెప్టెన్ గోపినాథ్ ఏ విధంగా స్పందిస్తారనే ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా గోపినాథ్ తన బయోపిక్ పై స్పందన తెలియజేసారు. అమెజాన్ ప్రైమ్ లో ఆకాశం నీ హద్దురా సినిమా చూసాను. నాకు నవ్వు రాలేదు.. ఏడుపూ రాలేదు.. కానీ నా గతం గుర్తొచ్చింది.

మనసుకు హత్తుకునేలా నా జీవితంలోని సంఘటనలకు తెరకెక్కించారంటూ సినిమా టీమ్ పై ప్రశంసలు కురిపించారు గోపినాథ్. సినిమాలో కల్పితం ఎక్కువగా ఉన్నప్పటికీ నా జీవితంలోని ఎమోషన్స్ న చక్కగా చూపించారు. నా పాత్రలో సూర్య అద్భుతంగా నటించారు. నా భార్య భార్గవి పాత్రలో అపర్ణ చాలా బాగా నటించింది. డైరెక్టర్ సుధా కొంగరకు హాట్స్ ఆఫ్. అంటూ కితాబిచ్చారు.

Related News