logo

  BREAKING NEWS

ఏపీ అసెంబ్లీ: చంద్రబాబు స్పీకర్ మధ్య మాటల యుద్ధం!  |   ప్ర‌భాస్ – ప్ర‌శాంత్ నీల్ తీసేది రీమేక్ సినిమా.. ఇంత రిస్క్ ఎందుకు..?  |   ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం.. ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం!  |   పేద విద్యార్థులకు ఎల్ఐసీ స్కాల‌ర్‌షిప్‌లు.. పూర్తి వివ‌రాలు ఇవీ  |   బ్రేకింగ్: గ్రేటర్ లోని ఆ ప్రాంతంలో పోలింగ్ రద్దు: ఎన్నికల సంఘం  |   కేంద్రంపై రైతుల దండయాత్ర ఎందుకు? నూతన వ్యవసాయ చట్టాల్లో ఏముంది?  |   అసెంబ్లీలో రగడ: చంద్రబాబు సహా టీడీపీ సభ్యుల సస్పెండ్!  |   కరోనా పుట్టింది ఎక్కడో కాదు భారత్ లోనే..? చైనా సంచలన ఆరోపణలు!  |   అమిత్ షా వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్!  |   ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తేనే కదా తెలిసేది: కేసీఆర్ పై అమిత్ షా  |  

ఆ అభ్యర్థులకు టికెట్లు ఇవ్వొద్దు… గ్రేటర్ ఎన్నికల్లో పార్టీలకు భారీ షాక్!

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో త్వరలోనే ఎన్నికల షెడ్యూలు విడుదల కానుంది. కాగా ఈసారి వివిధ పార్టీల నుంచి ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులకు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ షాకిచ్చింది. హైద్రాబాదులో ప్రస్తుతం కార్పొరేటర్లుగా ఉన్న వారిలో మొత్తం 30 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిపింది.

ఈసారి ఎన్నికల్లో నేర చరిత్ర ఉన్న అభ్యర్థులకు టికెట్లు ఇవ్వద్దని వారు డిమాండ్ చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో మొత్తం 72 మంది నేర చరిత్రగల వారు ఎన్నికల్లో పోటీ చేయగా అందులో 30 మంది గెలిచి కార్పొరేటర్లుగా ఉన్నారని ఫోరమ్ ఫార్ గుడ్ గవర్నెన్స్ పేర్కొంది. అయితే నేర చరిత్ర కలిగిన వారిలో 8 మంది మహిళలు కూడా ఉండటం విశేషం.

పార్టీల పరంగా చూస్తే.. ప్రస్తుతం పాలకమండలిలో 20 మంది నేర చరిత్ర గల అభ్యర్థులు ఉన్నారని తెలిపింది. కొత్తగా 17 మంది టీఆర్ఎస్ అభ్యర్థులు, 13 మంది బీజేపీ అభ్యర్థులపై కేసులు నమోదయ్యాయని పేర్కొంది. రానున్న ఎన్నికల్లో వీరికి టికెట్లు ఇవ్వద్దని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో పార్టీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.

Related News