logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

కరోనా కన్నా డేంజరస్ వ్యాధి.. ఏడాదిలో కోటి మంది చనిపోవచ్చు: డబ్ల్యూహెచ్వో

కరోనా మహమ్మారి విలయతాండవం తర్వాత రానున్న రోజుల్లో ఇలాంటి మహమ్మారుల జాడను గుర్తించడానికి ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా శాస్త్రవేత్తలు చెప్పిన ఓ వార్తతో ప్రపంచం ఉలిక్కిపడింది. కరోనా కన్నా ఎన్నో రేట్లు ప్రాధాకరమైన ఫంగస్ ను వారు గుర్తించారు. క్యాండిడా ఆరిస్ అనే భయంకరమైన ఫంగస్ ఆనవాళ్లను అండమాన్ దీవుల్లో గుర్తించారు. దీనినే సూపర్ బగ్ గా పిలుస్తున్నారు. ఔషధాలకు ఇది లొంగదని, కరోనా కన్నా వేగంగా వ్యాపించి భారీ ప్రాణ నష్టం కలిగిస్తుందని అంటున్నారు.

ఎక్కడ పుట్టిందో, ఎందుకు వ్యాపిస్తుందో తెలియని ఈ వైరస్ గనుక విస్తరించడం మొదలైతే ఏడాది లో కోటి మందికి పైగా ప్రాణాలను బలి తీసుకుంటుందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంటుంది. అయితే భారత దేశంలో ఈ వైరస్ ను తొలిసారి గుర్తించారు. 2009 లో ఈ వైరస్ ఓ వ్యక్తి శరీరంలో కనిపించింది. 2019 లో ఏకంగా 270 మందికి ఇది వ్యాపించింది. వీరిలో 8 మంది మరణించారు. ఈ ఫంగస్ మనిషి శరీరంలోకి ప్రవేశిస్తే అక్కడే తిష్ట వేసుకుని కూర్చుంటుంది.

ఇది సోకినప్పుడు మొదట ఎలాంటి లక్షణాలు కనిపించవు. కొద్ది రోజుల తర్వాత తీవ్ర మైన చలి జ్వరం వస్తుంది. ఆ జ్వరానికి ముందు దీనిని గుర్తించడం కష్టం. ఒక్కోసారి ఈ వ్యాధి తీవ్రతరమై ప్రాణాలకు ప్రమాదంగా మారుతుంది. ఈ సూక్ష్మజీవి శరీరంలో ప్రవేశించే ముందు కొంత కాలం చర్మంపై పై జీవించి ఉంటుందట. చిన్న గాయమైనా ఆ మార్గం గుండా రక్తంలోకి ప్రవేశిస్తుంది.

ఆ తర్వాత ఇన్ఫెక్షన్ ను కలుగజేస్తుంది. ఆ తర్వాత ఇది ప్రమాదకరమైన సెప్సిస్ కు దారి తీస్తుంది. మందులకు ఏమాత్రం లొంగదు అని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే ఇది మనుషులకు ఎలా సోకుతుందనే విషయం ఇప్పటికీ మిస్టరీగానే మారింది. ఈ బ్యాక్టీరియాను ప్రజాజీవనానికి అత్యంత ప్రమాదకరమైన వ్యాధుల జాబితాలో అమెరికా చేర్చింది.

Related News