logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

కరోనాపై పోరులో.. మరో కీలక నిర్ణయం ప్రకటించిన జగన్ సర్కార్!

ఆంధ్రప్రదేశ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు తాడేపల్లి గూడెంలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనాపై పోరులో పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. కరోనా బాధితుల చికిత్స కోసం రాష్ట్రవ్యాప్తంగా మరో 54 కరోనా ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఆరోగ్యం విషమించిన కరోనా బాధితుల చికిత్స నిమిత్తం ఇప్పటివరకు రాష్ట్రం మొత్తంలో 138 క్రిటికల్ కేర్ ఆసుపత్రులు ఉండగా వాటికీ అదనంగా మరో 5 ఆసుపత్రులను ఏర్పాటు చేయనున్నారు. అందులో ఇప్పటికే 3 ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకు వచ్చామని ముఖ్యమంత్రి తెలిపారు. అదేవిధంగా మరో 2380 క్రిటికల్ బెడ్ల సదుపాయాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో వచ్చే 6 నెలల్లో ప్రభత్వం కరోనా కట్టడికి అదనంగా రూ. 1000 కోట్లను వెచ్చించనుందన్నారు. మందులు, ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సిబ్బంది నియామకాల కోసం ఖర్చు చేస్తామని పేర్కొన్నారు. ఇవికాకుండా కోవిడ్‌ టెస్టులు, క్వారంటైన్‌ సదుపాయాలకోసం రాష్ట్ర ప్రభుత్వం రోజుకు సుమారు రూ.6.5 కోట్లు చొప్పున ఖర్చు చేస్తోందని తెలిపారు.

ఏపీ లో గత వారం రోజులుగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. డిచిన 24 గంటల్లో ఏకంగా 7998 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 72711కి చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 5248 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా.. 61 మంది మరణించారు.

Related News