logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

ఆర్టీసీ బస్సు సర్వీసులపై ముగిసిన ఉన్నతాధికారుల భేటీ.. ఇప్పట్లో లేనట్టే!

కరోనా లాక్ డౌన్ కారణంగా ఆర్టీసి బస్సు సర్వీసులు రద్దు చేసిన విషయం తెలిసిందే. కాగా కేంద్రం ఇస్తున్న సడలింపులతో మళ్ళీ అన్ని రాష్ట్రాల మధ్య బస్సులు తిరిగి రోడ్డెక్కాయి. కానీ ఒక్క తెలంగాణ – ఏపీ రాష్ట్రాల మధ్య ఎంతో కీలకంగా ఉన్న ఆర్టీసీ సర్వీసులు ఇంకా ప్రారంభం కాలేదు. కరోనా కారణంగా ఈ సర్వీసులను వాయిదా వేస్తూ వస్తున్నారు. గతంలో ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీ అధికారుల మ‌ధ్య జ‌రిగిన చ‌ర్చ‌ల్లో ప్రాథమికంగా కిలోమీటర్ల ప్రాతిపదికన బస్సుల్ని తిప్పేందుకు అంగీకారం కుదిరింది.

ఆ సమయంలో తెలంగాణకు 256 బస్సు సర్వీసులను తిప్పుతామని ఏపీఎస్ఆర్టీసీ ప్రతిపాదించింది. ఈ అంశంపై ఇరు రాష్ట్రాల రవాణా మంత్రులు పువ్వాడ అజయ్, పేర్ని నాని, ఆర్టీసీ ఎండీల మధ్య భేటీ జరగవలసి హైదరాబాద్ బస్సు భవన్ లో కరోనా కేసులు వెలుగు చూస్తుండటంతో ఇది కూడా వాయిదా పడింది. తాజాగా హైద్రాబాద్ బస్సు భవన్ లో ఉన్నతాధికారుల మధ్య జరిగిన సమావేశం ఇంతకు ముందే ముగిసింది.

ఈ చర్చలలో అంతర్ రాష్ట్ర సర్వీసుల పునరుద్ధరణ అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అంతా భావించారు. కాగా ఇప్పట్లో రెండు రాష్ట్రాల మధ్య బస్సులు నడిచే అవకాశం లేనట్టుగా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏపీఎస్సార్టీసి బస్సులు ఇరవై లక్షల కిలో మీటర్లు తిరుగుతున్నాయి. దాన్ని తగ్గించుకోవాలని అదే విధంగా రాష్ట్ర విభజన అనంతరం ఇరు రాష్ట్రాల మధ్య జరిగిన ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ ను కూడా మార్చి దాని స్థానంలో కొత్త అగ్రిమెంట్ ను చేసుకోవాలని టీఎస్సార్టీసి అధికారులు ఏపీఎస్సార్టీసి అధికారులను కోరినట్టుగా తెలుస్తుంది.

అందుకు తాము తమ ప్రభుత్వం తో చర్చలు జరిపిన అనంతరం ఈ ప్రతిపాదనపై స్పందిస్తామని ఎపిఎస్సార్టీసి అధికారులు తెలిపారు. దీంతో ఈ విషయంపై స్పష్టత వచ్చే వరకు రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సర్వీసులు లేనట్టుగానే తెలుస్తుంది.

Related News