logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయబోతున్న యంగ్ హీరోలు… ఫ్యాన్స్ కు అదిరిపోయే వార్త!

టాలీవుడ్ లో మల్టీ స్టారర్ సినిమాల హావా కొనసాగుతుంది. కొన్ని రోజులుగా బడా హీరోలు సైతం మల్టీ స్టారర్ సినిమాలపై ఆసక్తి చూపుతున్నారు. ఈ బాటలోనే పవన్ కళ్యాణ్, రానా, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కలిసి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు అదే బాటలో మరో ఇద్దరు యంగ్ హీరోలు సిద్ధమయ్యారు.

స్టైలిష్ స్టార్ ఆలు అర్జున్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ త్వరలోనే బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. వీరిద్దరితో కలిసి ఓ మల్టీ స్టారర్ ను తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో ‘ఆనందో బ్రహ్మ’, ‘యాత్ర’ సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు మహి. వి రాఘవ బన్నీ, విజయ్ ల కోసం ఓ మల్టి స్టారర్ కథను సిద్ధం చేసాడట.

ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు నిర్మాతగా అల్లు అరవింద్ వ్యవహరిస్తున్నారట. ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే బన్నీ విజయ్ ల మధ్య చాలా రోజులుగా మంచి సాన్నిహిత్యం ఉంది. వీరిద్దరూ ఒకరి సినిమా ఫంక్షన్లకు ఒకరు హాజరవడం, విజయ్ బ్రాండ్ దుస్తులను బన్నీ ధరించడం లాంటి తెలిసినవే. ఇప్పుడు ఈ వార్త ఈ హీరోల అభిమానుల్లో కొత్త జోష్ ను తెస్తుంది.

Related News