logo

  BREAKING NEWS

పీఆర్సీ నివేదిక లీక్: తెలంగాణ సర్కార్ సీరియస్..నిరాశలో ఉద్యోగులు!  |   బ్రేకింగ్: మళ్ళీ రాజకీయాల్లోకి మెగాస్టార్.. నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు!  |   ఎర్రకోట అల్లర్లు: పంజాబీ నటుడు దీప్ సిద్ధూ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!  |   అంబానీ సెకను ఆదాయం.. సామాన్యుడికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసా?  |   ప‌ద్మ‌విభూష‌ణ్‌, ప‌ద్మ‌భూష‌ణ్‌, ప‌ద్మ‌శ్రీ అవార్డుల‌తో ఎంత డ‌బ్బు ఇస్తారో తెలుసా ?  |   హింసాత్మకంగా మారిన రైతుల ట్రాక్టర్ ర్యాలీ  |   ఏపీ పంచాయతీ వార్: జగన్ సర్కార్ ఆదేశాలకు ఎస్ఈసీ నో..!  |   తెలంగాణలో కొత్త పార్టీ.. క్లారిటీ ఇచ్చిన వైఎస్ షర్మిల!  |   సుప్రీం తీర్పు: అధికారులతో సీఎం జగన్ అత్యవసర సమావేశం!  |   పంచాయతీ ఎన్నికలు.. ఉద్యోగ సంఘాలకు నిమ్మగడ్డ షాక్!  |  

నాగ‌బాబుకు బీజేపీ బంప‌ర్ ఆఫ‌ర్.. కేంద్రంలో కీల‌క ప‌ద‌వి ?

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబుకు త్వ‌ర‌లో కీల‌క ప‌ద‌వి ద‌క్క‌నుందా ? ఈ మేర‌కు భార‌తీయ జ‌న‌తా పార్టీ, జ‌న‌సేన పార్టీల మ‌ధ్య ఒక అవ‌గాహ‌న కుదిరిందా ? అందుకే నాగ‌బాబు టీవీ ప్రోగ్రామ్‌ల‌ను త‌గ్గించుకుంటున్నారా ? అంటే అవున‌నే ప్ర‌చారం పెద్ద ఎత్తున జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం బీజేపీ, జ‌న‌సేన పార్టీలు పొత్తులో ఉన్నాయి. ఈ రెండు పార్టీల పొత్తు ఆంధ్ర‌ప్రదేశ్‌లో కీల‌కంగా ఉండ‌నుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ క‌లిసి ప‌ని చేయాల‌ని ఈ పార్టీలు నిర్ణ‌యించాయి.

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఉన్న క్రేజ్‌, ఫ్యాన్ ఫాలోయింగ్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ కూట‌మికి బాగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని బీజేపీ భావిస్తోంది. అందుకే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో పొత్తు పెట్టుకుంది ఆ పార్టీ. ఇటీవ‌ల జ‌రిగిన గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో మొద‌ట జ‌న‌సేన పోటీ చేయాల‌ని అనుకుంది. కానీ, జ‌న‌సేన వేరుగా పోటీ చేస్తే త‌మ‌కు ఇబ్బంది అవుతుంద‌ని భావించిన బీజేపీ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో చ‌ర్చ‌లు జ‌రిపి పోటీ చేయ‌కుండా చేసింది. బీజేపీకి ఆ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ద్ద‌తు ఇచ్చారు.

త్వ‌ర‌లో ఏపీలో తిరుప‌తి లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఈ ఎన్నిక‌ను బీజేపీ కీల‌కంగా తీసుకుంది. త‌మ పార్టీ అభ్య‌ర్థి ఈ ఎన్నిక‌లో పోటీ చేస్తార‌ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్ర‌క‌టించారు. బీజేపీ ఇప్ప‌టికే తిరుప‌తి ఉప ఎన్నిక‌కు సంబంధించి భారీ క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఈ ఎన్నిక‌లో గెలిచి ఏపీలో బ‌ల‌మైన పార్టీగా ఎద‌గాల‌ని బీజేపీ భావిస్తోంది.

అలా జ‌ర‌గాలంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ద్ద‌తు అవ‌స‌రం. జ‌న‌సేన కూడా తిరుప‌తిలో పోటీ చేయాల‌ని భావిస్తోంది. ఇప్ప‌టికే బీజేపీ విజ్ఞ‌ప్తి చేసినందుకు జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల నుంచి విర‌మించుకుంది జ‌న‌సేన‌. ఇప్పుడు తిరుప‌తిలోనూ కాంప్ర‌మైజ్ కావాలంటే బీజేపీ నుంచి ఏదైనా ఆఫ‌ర్ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే ఒక రాజ్య‌స‌భ సీటు జ‌న‌సేన‌కు ఇస్తామ‌ని బీజేపీ ప్ర‌తిపాద‌న‌లు పంపించింద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఏపీలో రాజ్య‌స‌భ సీటు గెలుచుకునే బ‌లం బీజేపీకి లేదు. ఏదైనా వేరే రాష్ట్రం నుంచి జ‌న‌సేన అభ్య‌ర్థిని రాజ్య‌స‌భ‌కు పంపించే అవ‌కాశం ఉంటుంది. అయితే, జ‌న‌సేన త‌ర‌పున నాగబాబును రాజ్య‌స‌భ‌కు పంపించాల‌నే ఆలోచ‌న‌తో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉన్నార‌నేది తాజా ప్ర‌చారం. నాగ‌బాబు గ‌త ఎన్నిక‌ల్లో న‌ర్సాపురం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. రాజ‌కీయాల‌పైన ఆయ‌న‌కు చాలా ఆస‌క్తి ఉంది.

సామాజ‌క స‌మ‌స్య‌లు, రాష్ట్ర ప‌రిస్థితులు, ప్ర‌జ‌ల ఇబ్బందుల‌పై నాగ‌బాబుకు మంచి అవ‌గాహ‌న ఉంది. ప్ర‌త్య‌ర్థుల‌పై మాట‌ల తూటాలు పేలుస్తుంటారు. కాబ‌ట్టి, రాజ్య‌స‌భ‌కు వెళ్లేందుకు నాగ‌బాబు స‌రైన వార‌ని ప‌వ‌న్ భావిస్తున్నార‌ట‌. అందుకే నాగ‌బాబు కూడా త‌న టీవీ ప్రోగ్రామ్‌ల‌ను త‌గ్గించుకుంటున్నార‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న నిర్వ‌హించే అదిరింది షోను కూడా ఆపేశారు. ఈ విష‌య‌మై మ‌రో నెల రోజుల్లో క్లారిటీ రానుంది. ఒకవేళ నాగ‌బాబును రాజ్య‌స‌భ‌కు పంపిస్తే మెగా కుటుంబం నుంచి పెద్ద‌ల స‌భ‌కు వెళ్లే రెండో వ్య‌క్తిగా ఆయ‌న నిల‌వ‌నున్నారు. గ‌తంలో చిరంజీవి కూడా రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఎన్నికైన విష‌యం తెలిసిందే.

Related News