logo

  BREAKING NEWS

గుడ్ న్యూస్‌: క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ వచ్చేసింది..!  |   వైఎస్సార్‌, చంద్ర‌బాబు స్నేహ‌బంధంపై సినిమా  |   క‌రోనా ఖతం అయ్యే డేట్ చెప్పిన బిల్ గేట్స్‌  |   నిజంగానే పాపం త‌గిలిన‌ట్లుంది… క‌రోనాతో ఆ ఎస్సై మృతి  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వల్ల కూడా ఆ ప‌ని కాదు.. కొడాని నాని హాట్ కామెంట్స్‌  |   బ్రేకింగ్‌: మాజీ రాష్ట్ర‌ప‌తికి క‌రోనా పాజిటీవ్‌  |   క‌న్న‌డ దంప‌తుల ధైర్యం… పీఓకేలోని శార‌దాపీఠం నుంచి అయోధ్య‌కు ప‌విత్ర మ‌ట్టి  |   పాక్ నుంచి వ‌చ్చిన ఒకే కుటుంబంలో 11 మంది ఆత్మ‌హ‌త్య‌  |   విజ‌య‌వాడ కోవిడ్ సెంట‌ర్‌లో అగ్ని ప్ర‌మాదానికి కార‌ణాలివే..!  |   ప్లాస్మా దానం అంటే ఏమిటి ? ఎవ‌రు చేయాలి ? ఎలా చేయాలి ?  |  

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో బుగ్గన భేటీ.. ప్రధానాంశాలు ఇవే!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో బుగ్గన ఏపీకి సంబందించిన పలు కీలక అంశాలను ఆర్థిక మంత్రి ముందుంచారు. సుమారు అరగంట పాటు ఈ సమావేశం జరిగింది. అనంతరం బుగ్గన మాట్లాడుతూ.. కేంద్రం నుంచి ఏపీకి అందవలసిన నిధులను విడుదల చేయాలనీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరామన్నారు.

పోలవరం ప్రాజెక్టుకు అందవలసిన నిధులు, జీఎస్టీ పన్నుల వాటా, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేటాయించిన నిధుల పై చర్చ జరిపామన్నారు. కరోనా వల్ల రాష్ట్రంలో 40 శాతం ఆదాయం తగ్గిపోయిందన్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రతి అంశాన్ని వివరిస్తూ రాసిన విజ్ఞాపన పత్రాన్ని అందజేశామని తెలిపారు. వాటితో పాటు సాధారణంగా అందే నిధుల కన్నా రాష్ట్రానికి మరింత చేయూత అందించాలని కోరామన్నారు.

కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీలో జనాభా ప్రాతిపదికన రాష్ట్రానికి నిధులు రావాలని తెలిపారు. ఈ భేటీలో బుగ్గన వెంట ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజేయ్‌ కల్లం, ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్‌, నీటిపారుదల శాఖ కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉన్నారు.

Related News