logo

  BREAKING NEWS

బీరు బాబులకు షాకిచ్చే వార్త.. ఇకపై జన్మలో తాగరు..!

మందు బాబులు ఎంతో ఇష్టంగా సేవించే బీరులో ఓ ఉద్యోగి ఏం కలుపుతున్నాడో తెలిసి నిజంగానే షాక్ అవుతున్నారు నెటిజన్లు. ఈ వార్తలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారాయి. ప్రపంచ వ్యాప్తంగా బడ్వైజర్ బ్రాండ్ బీరుకు మంచి డిమాండ్ ఉంది. అమెరికాలోని కొలరాడోలో పెద్ద ప్లాంట్ లో దీనిని తయారు చేస్తారు. అయితే ఈ ప్లాంటులో పనిచేస్తున్న ఉద్యోగి ఒకరు గత 12 ఏళ్లుగా బీరు ట్యాంకులో మూత్రం పోస్తున్నాడట.

ఈ విషయం తెలుసి అతన్ని నిలదీయగా అతనిచ్చిన సమాధానం విని మరింత ఖంగుతిన్నారు. ప్రతి సారి వాష్ రూమ్ కు వెళ్లడం బద్ధకం గా భావించి బీరు ట్యాంకులోనే కానిచ్చేస్తున్నాడట. అయితే తమ కుటుంబ సభ్యులు ఎవరైనా బీరు తెమ్మంటే భయపడేవాడినని చెప్పాడు. ఇక ఈ విషయం అందరికీ తెలిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పని చేయనని ఇప్పటినుంచి బడ్వైజర్ బ్రాండు ప్రియులు నాణ్యమైన బీరునే తాగవచ్చని సమాధానం ఇచ్చాడట.

ఇన్నాళ్లుగా తాము తాగుతున్న బీరు కహాని విని గుండెలు బాదుకుంటున్నారు ఈ బ్రాండు ప్రియులు. ట్విట్టర్ లో బడ్వైజర్ హ్యాష్ ట్యాగ్ ను క్రియేట్ చేసి ట్రెండ్ చేస్తున్నారు. దీనిపై బాడ్వైజర్ సంస్థ కూడా స్పందించకపోవడం, అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ విషయంపై అనుమానం వచ్చిన ఓ సంస్థ దీనిపై అధ్యయనం చేసింది.

చివరకు ఇదంతా ఉత్తిదే అని తేల్చింది. ‘ఫూలిష్‌ హ్యూమర్‌ డాట్‌ కామ్’‌ వెబ్ సైటు వారు సరదాగా ఈ వార్తను సరదా కోసం క్రియేట్ చేసారని తేల్చింది. కానీ ఈ వార్త విన్న మందుబాబులంతా ఉలిక్కిపడ్డారు. చివరకు ఇదంతా నిజం కాదని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.

Related News