logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

ఫలించిన ‘శ్వేత రాయబారం’.. మనసు మార్చుకున్న బుద్ధా!

టీడీపీలో సొంత పార్టీ నేతల మధ్య మరోసారి వర్గ పోరు రాజుకుంది. టీడీపీ సీనియర్ నేతలు నాగుల్ మీరా, బుద్ధా వెంకన్న, బోండా ఉమాలు కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ కేశినేనిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేపటి చంద్రబాబు పర్యటనలో కేకేశినేని ఉంటె తాము ఆ కార్యక్రమంలో పాల్గొనబోయేది లేదని తెగేసి చెప్పారు. ఈ నేపథ్యంలో కేశినేని కుమార్తె శ్వేతా బోండా ఉమామహేశ్వర్ రావు ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా విజయ వాడ మేయర్ బరిలో ఉన్న తనకు మద్దతివ్వాలని కోరారు. అక్కడే ఉన్న బుద్ధా వెంకన్న, నాగుల్ మీరాలతో ఆమె చర్చించారు. ఈ భేటీ అనంతరం.. బుద్ధా వెంకన్న తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. విజయవాడ మేయర్ అభ్యర్థిగా శ్వేతా ఉండటం వలన తమకు ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు.

ఆమెను తానెప్పుడూ వ్యతిరేకించలేదన్నారు. ఈ ఎన్నికల్లో ఆమెకు తమ పూర్తి మద్దతు లభిస్తుందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. కాగా తనపై టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై స్పందించడానికి కేశినేని నాని నిరాకరించారు. ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో తమ పార్టీ అధినేత చంద్రబాబుకు తెలుసన్నారు. కాగా రేపటి చంద్రబాబు పర్యటనలో బోండా ఉమా, బుద్ధా వెంకన్న, నాగుల్ మీరాలు పాల్గొంటారా లేదా అనే విషయం ఉత్కంఠగా మారింది.

Related News