టీడీపీలో వర్గ పోరు తారాస్థాయికి చేరుకుంది. విజయవాడ మేయర్ అభ్యర్థిత్వం పార్టీలో చిచ్చు రేపింది. ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత పేరును విజయవాడ మేయర్ అభ్యర్థిగా ప్రకటించడంతో టీడీపీలో నాని వ్యతిరేక వర్గాలు ఏకమయ్యాయి. నాని పై ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా, సీనియర్ నేత నాగుల్ మీరా తిరుగుబాటుకు దిగారు. తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో నానిపై విరుచుకుపడ్డారు.
టీడీపీ అధినేత చంద్రబాబును ఏక వచనంతో మాట్లాడటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేశినేని నానిని చెప్పుతో కొట్టాలి అనుకున్నానని… రంగాను చంపిన కేసులో ముద్దాయిలను కేశినేని వెంటబెట్టుకు తిరుగుతున్నాడని నిప్పులు చెరిగారు. మేము విజయసాయి రెడ్డితో కొట్లాడుతుంటే.. ఆయనేమో ఏకంగా సాయిరెడ్డినే ఇంటికి లంచ్ కు పిలుస్తాడా? అంటూ ధ్వజమెత్తారు. నాని కులం పోకడలు పార్టీకి నష్టం చేసేవిగా పేర్కొన్నారు. నీ కులం ఓట్లే నీకు పడవు.
బాబు పెట్టిన భిక్షతో ఎంపీగా గెలిచావు. ‘నువ్వు తోపువైతే ఏ సెంటర్లోనైనా తేల్చుకుందాం రా’ అంటూ సవాలు విసిరారు. ఇకపై తానె విజయవాడ టీడీపీ పార్లిమెంట్ అభ్యర్థిగా ఉంటానని.. 2024 లో ఎంపీగా పోటీ చేసి గెలుస్తానని బుద్ధా వెంకన్న స్పష్టం చేశారు. కేశినేని రెండు కళ్ళు విరగ్గొడతానంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు. తన అనుచరుడిని ఒక్కడిని పంపినా నాని పని అయిపోతుందని హెచ్చరించారు. నాని ఉంటె ఎన్నికల్లో తాము పని చేయలేమని అన్నారు.