logo

  BREAKING NEWS

ఎన్నిక‌ల్లో గెలిస్తే ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్‌… బీజేపీ హామీ  |   18 నెల‌ల జైలు జీవితం.. ఒక్క మాట‌తో వైఎస్సార్‌కు రాజీనామా లేఖ‌  |   కిడ్నాప్ చేసిన గంట‌లోనే హ‌త్య చేశారు.. ఆ భ‌యంతోనే..!  |   దీక్షిత్‌ను పొట్ట‌న పెట్టుకున్న కిడ్నాప‌ర్లు  |   మ‌ళ్లీ తెర‌పైన శ్రీహ‌రి, సౌంద‌ర్య‌ను చూసే అరుదైన‌ అవ‌కాశం  |   కేసీఆర్‌తో గొడ‌వ ఎక్క‌డ మొద‌లైందో చెప్పిన కోదండ‌రాం  |   ఆర్థిక ఇబ్బందుల్లో ప్ర‌ధాని.. ఈ క‌ష్టాలు ఎవ‌రికీ రావేమో..!  |   క‌ర్నూలు మ‌హిళ‌కు దొరికిన‌ కోటి రూపా‌యల వ‌జ్రం  |   బ్రేకింగ్‌: క‌రోనా వ్యాక్సిన్‌పై ప్ర‌ధాని మోడీ కీల‌క ప్ర‌క‌ట‌న‌  |   ద‌సరా పండుగ రోజు జ‌మ్మి చెట్టుకు ఎందుకు పూజిస్తారో తెలుసా ?  |  

చైనాలో మొద‌లైన‌ మ‌రో జ‌బ్బు.. ఇది సోకితే పిల్ల‌లు పుట్ట‌రు‌

చైనాలోని వుహాన్ న‌గ‌రంలో 9 నెల‌ల క్రితం పుట్టిన క‌రోనా వైరస్ ఇప్పుడు ప్ర‌పంచం మొత్తాన్ని అత‌లాకుత‌లం చేస్తోంది. ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా ఈ వైర‌స్ నుంచి ఏ దేశ‌మూ కోలుకోవ‌డం లేదు. వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్ప‌ట్లో ఈ వైర‌స్ నుంచి బ‌య‌ట‌ప‌డ‌టం క‌ష్ట‌మేన‌ని నిపుణులు చెబుతున్నారు. ఇంకా క‌రోనా సృష్టించిన విప‌త్తు నుంచి కోలుకోక‌ముందే చైనాలో మ‌రో ప్ర‌మాద‌క‌ర జ‌బ్బు వ్యాప్తి మొద‌లైంది. ఇప్ప‌టికే 3,245 మంది చైనా ప్ర‌జ‌ల‌కు ఈ జబ్బు సోకింద‌నే వార్త‌లు అంత‌ర్జాతీయ మీడియాలో వ‌స్తున్నాయి. ఈ జ‌బ్బు ల‌క్ష‌ణాలు, న‌ష్టాలు తీవ్రంగా ఉండ‌టంతో ఈ జ‌బ్బు ఇప్పుడు అంద‌రిలోనూ భ‌యం పుట్టిస్తోంది.

చైనాలో వ్యాపిస్తున్న ఈ వ్యాధి పేరు బ్రూసెల్లోసిస్‌. నిజానికి ఇది కొత్త వ్యాధి కాదు. గ‌త అనేక ఏళ్లుగా చైనా స‌హా అనేక దేశాల్లో ఈ వ్యాధి జాడ ఉంది. వ్యాధిని పూర్తిగా నివారించ‌డం, వ్యాక్సిన్లు ఉండ‌టంతో గ‌త కొన్నేళ్లుగా బ్రూసెల్లోసిస్ వ్యాధి క‌నుమ‌రుగైంది. ఇప్పుడు చైనాలోని గ‌న్షూ ప్రావిన్స్‌లో మ‌ళ్లీ వ్యాపించ‌డం మొద‌లైంది. క‌రోనా లాగా బ్రూసెల్లోసిస్ అనేది వైర‌స్ కాదు. ఇది ఒక బ్యాక్టీరియ‌ల్ ఇన్‌ఫెక్ష‌న్‌. ఒక ఫార్మాస్యూటిక‌ల్ కంపెనీలో గ‌త ఏడాది జులైలో జ‌రిగిన లీకేజీ కార‌ణంగా ఈ బ్యాక్టీరియా జ‌నావాసాల‌కు చేరి ప్ర‌జ‌ల‌కు సోకుతోంది.

గ‌న్షూ ప్రావిన్స్ అనే ప్రాంతంలో ఈ వ్యాధి ల‌క్ష‌ణాలు ఉన్న 21,487 మందికి ప‌రీక్ష‌లు జ‌ర‌ప‌గా 15 శాతం మందికి ఈ వ్యాధి సోకింద‌ని తేలింది. ప‌శువుల‌కు ఇచ్చే బ్రూసెల్లా అనే వ్యాక్సిన్‌ను త‌యారు చేసే ఫార్మాస్యూటీక‌ల్ కంపెనీలో ఈ బ్యాక్టీరియా లీక్ కావ‌డం వ‌ల్ల ఈ ఇన్‌ఫెక్ష‌న్ ప్ర‌జ‌ల‌కు సోకుతోంది. బ్రూసెల్లా అనే బ్యాక్టీరియా నుంచి ఈ వ్యాధి మొద‌ల‌వుతుంది. ఎక్కువ‌గా బ‌ర్రెలు, మేక‌లు, గొర్రెల‌కు బ్రూసెల్లోసిస్ వ్యాధి సోకుతుంది. మ‌నుషుల‌కు కూడా ప‌శువుల నుంచే ఈ వ్యాధి సోకుతుంది.

పాడైపోయినా లేదా స‌రిగ్గా ఉడ‌క‌ని మాంసం తిన‌డం, ప‌చ్చి పాలు లేదా స‌రిగ్గా కాగ‌ని పాల‌ను తాగ‌డం వ‌ల్ల ఈ ఇన్‌ఫెక్ష‌న్ మ‌నుషుల‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది. బ్రూసెల్లోసిస్ వ్యాధి సోకిన ప‌శువుల‌ను ముట్టుకున్నా, వాటి ర‌క్తాన్ని తాకినా ఈ వ్యాధి మ‌నుషుల‌కు సోకుతుంది. ప్ర‌త్యేకించి ప‌శుపోష‌ణ‌లో ఉన్న వారికి ఈ వ్యాధి ముప్పు ఎక్కువ‌గా ఉంటుంది. 1850లో తొలిసారి ఈ వ్యాధిని గుర్తించారు. చివ‌ర‌కు 2008లో బోస్నియాలో ఈ వ్యాధి వెయ్యి మందికి సోకింది. ఇప్పుడు మ‌ళ్లీ చైనాలో మొద‌లైంది.

మ‌నుషుల నుంచి మ‌నుషుల‌కు ఈ వ్యాధి సోకే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉండ‌టం కొంత మంచి విష‌యం. అయితే, ఈ వ్యాధి బారిన ప‌డిన వారు దీర్ఘ‌కాలం ఇబ్బంది ప‌డాల్సి వ‌స్తుంది. త‌ల‌నొప్పి, కండ‌రాల నొప్పి, జ్వ‌రం, నీర‌సం, వంటి సాధార‌ణ ల‌క్ష‌ణాల‌తో పాటు పిత్తాశ‌యం, గుండె, లివ‌ర్ వృష‌ణాలు వాయ‌డం ఈ వ్యాధి ల‌క్ష‌ణాలు. ఈ వ్యాధి సోకిన వారిలో కొంద‌రికి సంతాన స‌మ‌స్య‌లు కూడా వ‌స్తాయి. స్పాండిలైటిస్ వంటి దీర్ఘ‌కాలిక జ‌బ్బులు కూడా వ‌చ్చే ప్ర‌మాదం ఉంటుంది. చాలా కాలం పాటు వాంతులు, విరేచ‌నాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డ‌తారు. వ్యాధి సోకిన వెంట‌నే దీనిని గుర్తించ‌డం కూడా క‌ష్ట‌మే.

మ‌నిషి నుంచి మ‌నిషికి సోకే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల ఈ వ్యాధి వేగంగా వ్యాపించే అవ‌కాశం లేదు. క‌రోనా వైర‌స్ మ‌నిషి నుంచి మ‌నిషికి సులువుగా సోకుతుంది కాబ‌ట్టి ప్ర‌పంచ‌మంతా ఈ వైర‌స్ బారిన ప‌డింది. కానీ, బ్రూసెల్లోసిస్ వ్యాధి వ్యాప్తి అంత వేగంగా ఉండ‌దు. ఈ వ్యాధికి వ్యాక్సిన్‌లు కూడా ఉండ‌టంతో క‌ట్ట‌డి చేయ‌డం కూడా సుల‌భ‌మే. ఈ బ్యాక్టీరియాను అమెరికా బ‌యోవెప‌న్‌గా కూడా అభివృద్ధి చేసింది. అయితే, త‌ర్వాతి కాలంలో ఈ బ‌యోవెప‌న్‌ను మ‌ళ్లీ ఆ దేశ‌మే నాశ‌నం చేసేసింది.

Related News