logo

  BREAKING NEWS

మహిళలు పీరియడ్స్ సమయంలో వాక్సిన్ తీసుకుంటే ప్రమాదమా?  |   బీపీ, షుగర్ ఉన్నవారు వాక్సిన్ వేసుకోవచ్చా..?  |   కోవిడ్ చికిత్సకు కొత్త మందు.. ఆమోదించిన డీసీజీఐ, ఒక్క డోసుతో కరోనా ఆటకట్టు  |   కరోనా రోగులకు ఆక్సిజన్ స్థాయిలు అమాంతం పెంచే టెక్నిక్.. సూచించిన ఆరోగ్య శాఖ  |   మళ్ళీ తగ్గిన బంగారం ధరలు: 24.04. 2021 బంగారం, వెండి ధరలు  |   మౌత్ వాష్ లతో తగ్గుతున్న కరోనా ముప్పు.. నోట్లోనే వైరస్ ఖతం!  |   రూ. 50 వేల ప్రారంభ వేతనంతో.. డీఎఫ్‌సీసీఐఎల్ ప్రభుత్వ రంగ సంస్థలో భారీగా ఉద్యోగాలు  |   కరోనా రోగులకు శుభవార్త: ఇంట్లోనే ఆక్సిజన్.. ఈ ఒక్కటి ఉంటె చాలు!  |   కరోనా తిప్పలు తీరుస్తున్న ‘తిప్పతీగ’.. మహమ్మారికి దివ్యౌషధం, కరోనా సోకినా ఏమీ చేయలేదట!  |   కరోనా బారిన పడ్డారా? చికిత్స ఎలా? ఆక్సిజన్ ఎక్కడ దొరుకుతుంది? ఆసుపత్రుల వివరాలు అన్నిటికీ ఒకటే యాప్  |  

బ్రిటన్ ప్రధాని నోటి వెంట రామాయణ గాథ.. సీతారాముల్లా గెలిచి రావాలంటూ పిలుపు

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రామాయణ గాథను వివరించి ఆశ్చర్యపరిచారు. శ్రీరాముడు తన భార్య సీతాదేవితో కలిసి రావణుడిని ఓడించినట్టుగా మనం కూడా కరోనా వైరస్ ను ఓడించి లక్షల దీపాలను వెలిగించాలని ప్రధాని తమ దేశస్తులకు పిలుపునిచ్చారు. చీకటిపై వెలుగు, మంచిపై చెడు, అజ్ఞానం పై జ్ఞానం విజయం సాధించడమే దీపావళి అని అన్నారు.

మనం కూడా దీనిని ప్రేరణగా తీసుకుని వైరస్ తో పోరాడాలంటూ వ్యాఖ్యానించారు. బ్రిటన్ లో మూడు రోజుల పాటు జరిగే ‘ఫాంటాస్టిక్ వర్చ్యువల్ ఫెస్ట్’ సందర్భంగా అయన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రవాస భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఏటా దీపావళి సందర్భంగా ఎంతో ఆడంబరంగా జరిగే ఈ వేడుకలను ఈసారి కరోనా కారణంగా భారతీయులంతా ఇళ్లలోనే జరుపుకోవాలని ఆయన విజ్ఞప్తి చేసారు.

భారతీయులకు ఇది కొంచెం కష్టమే అయినా వీడియో కాల్ ద్వారా ప్రతి ఒక్కరు ఈ వేడుకలో పాల్గొనాలని కోరారు. కాగా ప్రధాని బోరిస్ వ్యాఖ్యలపై అక్కడి ప్రవాస భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

Related News