logo

  BREAKING NEWS

బ‌జాజ్ చేత‌క్ మ‌ళ్లీ వ‌చ్చేసింది.. ధ‌ర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు  |   హ‌మ్మ‌య్య‌… ఆ వ్యాక్సిన్‌లు కూడా వ‌చ్చేస్తున్నాయి  |   మీ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయ్యిందా? మీ డేటా ఎక్కడైనా లీక్ అయ్యిందా? ఇలా తెలుసుకోండి  |   తగ్గిన బంగారం ధరలు 14.04. 2021 నాటి బంగారం, వెండి ధరలు  |   మళ్ళీ పెరిగిన బంగారం ధరలు 13.04.2021 నాటి బంగారం, వెండి ధరలు  |   శుభవార్త: భారత్ లో మరో వాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్!  |   కరోనా సెకండ్ వేవ్: ఎక్కువ మందిలో బయటపడుతున్న లక్షణం ఇదే  |   బ‌ట్ట‌లు లేకుండా అమ్మాయిలు వీడియో కాల్ చేస్తారు టెంప్ట్ అయితే మీ ప‌ని ఖ‌తం  |   హలీమ్ తింటే బరువు పెరుగుతారా?  |   ఆ నాలుగు ప్రాంతాల్లోనే కుంభమేళా ఎందుకు? కోట్ల ఖర్చుతో ఎందుకు నిర్వహిస్తారు?  |  

భార్యాబిడ్డల కోసమే రాచరికం వదులుకున్నా.. సంచలన విషయాలు బయటపెట్టిన బ్రిటన్ యువరాజు!

బ్రిటన్ రాజకుటుంబంలో అంతర్గత విభేదాలు ఒకొక్కటిగా బయటపడుతున్నాయి. బ్రిటన్ యువరాజు హ్యారీ టీవీ నటిగా పాపులర్ అయిన మేఘన్ మార్కెల్ ను 2018లో ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే పెళ్ళైన కొంత కాలానికే ఈ దంపతులు రాచరికాన్ని వదులుకుని బయటకు రావడం సంచలనంగా మారింది. హ్యారీని పెళ్లి చేసుకుని బంకీమ్ హ్యామ్ కోటలో అడుగుపెట్టిన నాటి నుంచి తాను ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని, అవమానాలకు గురయ్యానని మేఘన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెళ్లి తర్వాత తొలిసారిగా ఈ జంట మీడియాతో మాట్లాడారు.

హ్యారీని పెళ్లి చేసుకుని రాజకుటుంబంలోకి వచ్చిన తర్వాత రాణి ముందు ఎలా ఉండాలి? అక్కడి వారితో ఎలా ప్రవర్తించాలి అనే విషయాలు తెలియక చాలా ఇబ్బంది పడ్డానన్నారు. చాలాకాలం గదిలో నుంచి బయటకు రాకుండా చీకటి జీవితం గడిపానన్నారు. కొన్ని సందర్భాలలో ఆత్మహత్య చేసుకోవాలనేంత మానసిక వేదనను గురయ్యాను. అయితే నాకు మాత్రం ఆ కోటలో ఎవ్వరి నుంచి సహాయం అందకపోగా నాపై ఎన్నో నిందలు వేశారు.

నా రంగు కారణంగా పుట్టబోయే బిడ్డ రంగుపై కూడా వివక్ష చూపారు. నా పెళ్లి రోజు దుస్తులపై తోటి కోడలు అభ్యంతరం తెలపడం బాధించింది. ఆ తర్వాత ఆమె క్షమాపణలు చెప్పింది. కానీ మీడియా మాత్రం నేనే తప్పు చేసినట్టుగా ప్రచారం చేసిందని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ ఇంటర్వ్యూలో ప్రిన్స్ హ్యారీ కూడా తన కుటుంబంపై కీలక వ్యాఖ్యలు చేసారు. తన భార్య బిడ్డ భవిష్యత్ కోసమే కోట నుంచి బయటకు వచ్చానన్నారు.

అక్కడి నుంచి వచ్చిన తర్వాత తనకు ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదన్నారు. అక్కడి వారు నన్ను ట్రాప్ చేశారు. చివరకు నా పరిస్థితి కూడా తల్లి డయానా లాగా అవుతుందేమో అని భయపడ్డానని చెప్పుకొచ్చారు. కాగా ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్ లు 2018 లో పెళ్లి చేసుకున్నారు. అమెరికాలో స్వేచ్చాయుత జీవితం గడిపిన మేఘన్ మార్కెల్ రాచరిక పద్దతులలో ఇమడలేక భర్తతో సహా బయటకు వచ్చేసారు. కాగా ఆమె కోటలోని సిబ్బందిని వేధించారనే ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు బ్రిటన్ లో సంచలనంగా మారింది.

Related News