logo

  BREAKING NEWS

చంద్ర‌బాబు స‌వాల్‌కు సై అంటున్న జ‌గ‌న్‌..? రెఫ‌రెండంకు సిద్ధం.?  |   టీడీపీ – వైసీపీ వ‌ర్గాల మ‌ధ్య చిచ్చుపెట్టిన ఆష్టాచెమ్మా ఆట‌..!  |   తెలంగాణ‌లో మ‌రో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి క‌రోనా పాజిటీవ్‌  |   పంతం నెగ్గించుకున్న నిమ్మ‌గ‌డ్డ‌.. మ‌ళ్లీ కుర్చీలోకి..!  |   ఆవిరి పీలిస్తే క‌రోనా వైర‌స్ చ‌నిపోతుందా..? అస‌లు నిజం ఇది..!  |   బ్రేకింగ్: కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్!  |   బోది ధ‌ర్ముడిని చంపేశారా..? మ‌రి సైనికుడికి క‌నిపించింది ఎవ‌రు..?  |   విశాఖ షిప్ యార్డు బాధితులకు భారీ సాయం ప్రకటించిన ప్రభుత్వం  |   రాజధానిపై ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు..!  |   బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్య‌వ‌ర్గాన్ని ప్ర‌క‌టించిన బండి సంజ‌య్‌  |  

మేనమామతో పెళ్లి… మూడో రోజే నవవధువు ఆత్మహత్య!

పెళ్ళైన మూడో రోజే నవ వధువు ఆత్మహత్య చేసుకుని మరణించింది. కాళ్ళ పారాణి ఆరక ముందే వధువు ఇంతటి దారుణ నిర్ణయం తీసుకోవడంతో పెళ్లింట విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే.. సీతానగరానికి చెందిన మహదాసు శ్రీను, మంగ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె రమ్య శ్రీదేవి (20) డిగ్రీ చదువుతుంది.

ఈ క్రమంలో ఆమెకు పశ్చిమ గోదావరి మండలం లక్ష్మణ పురానికి చెందిన ఆమె మేనమామతో వివాహం నిశ్చయించారు పెద్దలు. వీరిద్దరికి బుధవారం రోజున పెళ్లి జరిపించారు. శుక్రవారం రోజున యువతి ఇంట్లో ఉన్న ఎలుకల మందు తాగి ఆత్మహత్య కు ప్రయత్నించింది. దీంతో హుటాహుటిన మండపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు.

కొన ప్రాణాలతో ఉన్న యువతిని బతికించేందుకు వైద్యులు శతవిధాలా ప్రయత్నాలు చేసారు. కానీ అప్పటికే ఆమె అధిక మొత్తంలో విషం తాగేయడంతో ప్రాణాలు కాపాడలేకపోయారు. దీంతో యువతీ ప్రాణాలు విడిచింది అని వైద్యులు తెలిపారు. అయితే యువతి ఆత్మహత్యకు మాత్రం కారణం తెలియడం లేదు. మేనమామతో పెళ్లి ఆమెకు ఇష్టం లేదా? లేక చదువు మాన్పించి పెళ్లి చేసారని మనస్తాపం చెందిందా? అనే విషయాలు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా యువతి కాల్ డేటా ఆధారంగా ఇతర వివరాలు సేకరిస్తున్నారు.

Related News