logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

పెళ్ళైన రెండో రోజే భర్తకు ఉహించని షాకిచ్చిన నవ వధువు!

పెళ్ళైన రెండో రోజే భర్తకి షాకిచ్చింది ఓ నవ వధువు. భర్త ఇంటి నుంచి నగదు బంగారంతో ఉడాయించింది. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పెద్దపప్పూరు మండలం కమ్మవారి గ్రామానికి చెందిన పయ్యావుల కేశవామురళి భార్య ఇటీవల అనారోగ్యంతో మరణించింది. తన ఇద్దరు పిల్లలు తల్లి లేని వారు కావడంతో గత నెల 28 న నల్లమడకు చెందిన మరో యువతిని పెద్దల సాక్షిగా వివాహమాడాడు.

అయితే పెళ్లి అయిన వెంటనే భర్తతో కాపురానికి వచ్చిన ఆ యువతి తెల్లారేసరికి ఇంట్లో ఉన్న డబ్బు, నగలన్నీ ఊడ్చేసింది. ఇంట్లో ఉన్న మూడు తులాల బంగారం నగలు తీసుకుని చెక్కేసింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఆమె ఆచూకీ కోసం గాలించారు. తాజాగా యువతిని ఒడిశా రాష్ట్రంలో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు.

అక్కడ ఉన్న తన ప్రియుడి కోసమే ఆమె వెళ్ళిపోయినట్టుగా తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా ఒడిశా రాష్ట్రంలో నుంచి ఆమెను రాష్ట్రానికి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

Related News