logo

తాళి కట్టే సమయానికి వరుడికి షాకిచ్చిన పెళ్లి కూతురు..

సరిగ్గా తాళి కట్టే సమయానికి ఓ వధువు కాబోయే వాడికి భారీ షాకిచ్చింది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన వీరికి అక్టోబర్ 29న పెద్దల సమక్షంలో వివాహం నిశ్చయమైంది. పెళ్లి రోజునాడు వరుడు వధువు మెడలో తాళి కట్టడానికి సిద్ధమవుతుండగా ఆమె నిరాకరించింది. కారణం అడగగా వధువు చెప్పిన సమాధానానికి విస్తుపోవడం అక్కడున్నవారివంతైంది.

ఇప్పుడే తాళి కటొద్దు నా ప్రియుడు వస్తాడని ఆమె పెళ్లి ఆపే ప్రయత్నం చేసింది. అదే విషయాన్ని తల్లిదండ్రులకు, బంధువులకు చెప్పి సర్ది చెప్పాలనుకుంది. ఉహించని ఈ సంఘటనతో పెళ్లి కొడుకు షాక్ కు గురయ్యాడు. వధువు ప్రవర్తనకు కోపంతో ఊగిపోయిన వధువు బంధువులు ఆమెపై చేయి చేసుకోబోయారు.

ఆఖరికి వారితో మాట్లాడుతూనే వధువు పెళ్లి పీటల నుంచి లేచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత రాజీకొచ్చిన వధువు కుటుంబ సభ్యులు ఆమెను ప్రియుడికిచ్చి అదే మండపంలో పెళ్లి జరిపించడంతో కథ సుకాంతమైంది.

Related News