logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

మరి కొన్ని గంటల్లో పెళ్లి.. బ్యూటీ పార్లర్ లో వధువు దారుణ హత్య

మరికొద్ది గంటల్లో పెళ్లి జరగవలసి ఉండగా పెళ్లికూతురు దారుణ హత్యకు గురైన ఘటన మధ్యప్రదేశ రాష్ట్రంలో జరిగింది. రాష్ట్రంలోని ర‌త్లామ్ జిల్లా జ‌వోరా గ్రామానికి చెందిన యువతికి ఆదివారం సాయంత్రం పెళ్లి జరగవలసి ఉంది. కాగా ఈరోజు మధ్యాహ్నం పెళ్లి కూతురు తన సోదరిని వెంటబెట్టుకుని బ్యూటీ పార్లర్ కు వెళ్ళింది. పార్లర్ లో ముస్తాబు అవుతున్న సమయంలో ఒక్కసారిగా లోపలి దూసుకువచ్చిన దుండగుడు యువతి గొంతును కత్తితో కోసి అక్కడి నుంచి పరారయ్యాడు.

కళ్లముందే ఊహించని పరిణామంతో నిర్ఘాంతపోయిన యువతి సోదరి తేరుకుని కేకలు వేయడంతో స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే యువతి మరణించినట్టుగా వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప‌రారీలో ఉన్న నిందితుడి కోసం పత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.

మరి కొద్దీ గంటల్లో పెళ్లి చేసుకుని అత్తవారింట అడుగు పెట్టవలసిన కూతురు అర్థాంతరంగా హత్య కు గురికావడంతో పెళ్లింట విషాదం నెలకొంది. కాగా ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఈ దారుణంతో మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉలిక్కిపడింది.

Related News