logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

రెండు రోజుల్లో పెళ్లి.. వధువు ఫోన్ స్విచ్ ఆఫ్.. అసలు కారణం తెలిసి అంతా షాక్!

మరో రెండు రోజుల్లో పెళ్లి అనగా పెళ్లి కూతురు ఇచ్చిన షాక్ కు వరుడి మైండ్ బ్లాక్ అయ్యింది. పెళ్లి ఏర్పాట్లు జరుగుతుండగా పెళ్లి కూతురు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో ఆరా తీయగా పెళ్లి కూతురు అసలు రంగు బయటపడింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లోని పద్మారావు నగర్ కు చెందిన అర్జున్ కు సోషల్ మీడియాలో వర్ణన మల్లికార్జున్ అనే యువతి పరిచయమైంది.

కొంతకాలం పరిచయం తర్వాత వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. అయితే పెళ్లి చేసుకుందామని అనుకున్న నాటి నుంచి ఆ యువతి బాధితుడి దగ్గర ఏదో ఒక కారణం చెప్పి డబ్బులు గుంజేది. ఇలా ఏకంగా రూ. 14 లక్షల దాకా లూటీ చేసింది. అయినా ప్రేమించిన అమ్మాయి కావడం త్వరలో పెళ్లి కూడా చేసుకుంటుంన్నాం అని భావించిన బాధితుడు అడిగినపుడల్లా డబ్బులు పంపేవాడు.

అయినా ఏ ఒక్క రోజూ తనపై అనుమానం కలగకుండా యువతి జాగ్రత్త పడింది. చివరకు పెళ్ళికి రెండు రోజులు ఉందనగా ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోవడంతో మోసపోయానని భావించిన బాధిత యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. సోషల్ మీడియా పరిచయాలతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నా ఇంకా ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉండటం గమనార్హం.

Related News