logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

బ్రెస్ట్ క్యాన్సర్.. చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈ సమస్య రోజురోజుకీ తీవ్రమవుతూ మహిళల ప్రాణం తీస్తోంది.. మన దేశంలో ప్రతి 10 మందిలో ఒకరు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. చాలా మంది ఈ వ్యాధిపై పై అవగాహన లేమి కారణంగా చివరి దశలో దీనిని గుర్తిస్తుంటారు. ఈ దశ ప్రమాదకరమైనది. అందుకే ముందు నుంచే మహిళలు ఈ సమస్య పట్ల అవగాహనం పెంచుకోవడం చాలా అవసరం. ఈ వ్యాధి గురించిన లక్షణాల ముందుగానే గుర్తించడం వల్ల సమస్య గురించి ముందునుంచే జాగ్రత్త పడొచ్చు. మరి బ్రెస్ట్ క్యాన్సర్ గురించిన వాస్తవాలు, అపోహలు వాటి లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

కారణాలు:
మహిళల్లో వయసై పెరుగుతున్న కొద్దీ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్కు కూడా పెరుగుతుండటం వైద్యులు గుర్తించారు. వారి కుటుంబంలో ఎవరికైనా ఈ క్యాన్సర్ ఉంటె అది తరువాతి తరాల వారికీ వచ్చే అవకాశం ఉంటుంది. 12 ఏళ్ల కంటే ముందుగానే రజస్వల కావడం, 55 ఏళ్ళ కంటే ముంచే నెలసరి ఆగిపోయిన స్త్రీలకు ఈ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. 30 ఏళ్ల తర్వాత తొలి సంతానం కలగడం, హార్మోన్ మాత్రలు ఎక్కువగా తీసుకోవడం, అధిక బరువు ఉండటం లాంటివన్నీ ఈ క్యాన్సర్ కు కారణాలుగా చెప్పవచ్చు.

బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి?
మహిళలు పీరియడ్స్ మొదలైన 5, 6 వ రోజుల్లో ఎవరికి వారు సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. అద్దం ముందు నిల్చుని రొమ్ములను క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ దశల్లో తిప్పుతూ పరీక్షించుకోవాలి. చేతికి ఏదైనా గడ్డలా తగులుతుందా అనే విషయం పరీక్షించాలి. సాధారణ చర్మం రంగుకన్నా ఛాతీపై చర్మం నారింజ, పసుపు రంగుల్లో ఉండి బ్రెస్ట్ నిపుల్స్ చుట్టూ ఉండే చర్మం పొలుసులుగా మారి రాలిపోతుంటే కచ్చితంగా వైద్యులను సంప్రదించాలి. నిపుల్స్‌ని నొక్కితే అవి సరిగా లోపలికి వెళ్లకపోయినా, రెండు కూడా డిఫరెంట్ సైజ్‌లలో ఉన్నా కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు అనుమానించాలి. నిపుల్స్ నుంచి తెలుపు, పసుపు రంగుల్లో ఏదైనా ద్రవం ఏదైనా వస్తుందా అనే విషయం గమనించుకోవాలి. రొమ్ములు, చంకల్లో గడ్డలు ఉన్నట్లుగా అనిపించినా అనుమానించాలి. బ్రెస్ట్ క్యాన్సర్ ను మొదటి దశలోనే గుర్తించి వైద్యులను సంప్రదించడం వలన ఈ సమస్య నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు.

వాస్తవాలు- అపోహలు..
రొమ్ముల్లో గడ్డలు ఉండటం సహజం అయితే అవన్నీ క్యాన్సర్ కు సంబందించినవి కావు. కొంత మంది స్త్రీలలో ఫైబ్రో ఎడినోమా కారణంగా కూడా ఈ గడ్డలు ఏర్పడతాయి అవి ప్రమాదకరమైనవి కావు. కానీ పరీక్ష చేయించుకోవడం తప్పనిసరి. సాధారణంగా 50 సంవత్సరాలు దాటిన మహిళలకే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందనేది పూర్తిగా నిజం కాదు. ఇటీవల చిన్న వయసు స్త్రీలలో కూడా ఈ వ్యాధి లక్షణాలు బయటపడుతున్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్ స్త్రీలకు మాత్రమే వస్తుందనేది అపోహ మాత్రమే. పురుషులకు కూడా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

క్యాన్సర్ ను ఎలా నిర్దారిస్తారు?
చాలా సందర్భాల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ను గుర్తించడం చాలా కష్టం. అందుకోసం మామోగ్రఫీ అనే పరీక్ష ద్వారా ముందే గుర్తించే అవకాశం ఉంటుంది. 40 ఏళ్ళు పైబడిన స్త్రీలంతా మామోగ్రఫీ పరీక్ష తప్పక చేయించుకోవాలి.

బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే..
సీజనల్ గా మా మనకు లభించే మామిడి పండ్లలో బ్రెస్ట్ క్యాన్సర్ కణాలతో పోరాడే శక్తి ఉంటుంది. ఇందులో ఉండే పోలిఫినోల్ అనే రసాయనం బ్రెస్ట్ క్యాన్సర్ తో పాటుగా ప్రొస్టేట్, లుకేమియా, ఊపిరితిత్తుల క్యాన్సర్ కణాల పై అద్భుతమైన ప్రభావం చూపుతుంది. ప్రతిరోజూ 60 గ్రాముల చొప్పున వాల్ నట్స్ తీసుకోవాలి. ఇందులోని ఒమెగా 3, యాంటీ ఆక్సిడెంట్స్, పైతోస్టెరాల్స్ బ్రెస్ట్ క్యాన్సర్ కారణమయ్యే కణాల పెరుగుదలను నివారిస్తాయి. పసుపు, అవిసె గింజలను కూడా ఆహారంలో చేర్చుకోవాలి.

Related News