logo

  BREAKING NEWS

RRR టీజ‌ర్ కాపీ కొట్టారా..? ప్రూఫ్స్ చూపిస్తున్న నెటిజ‌న్లు  |   ఎన్నిక‌ల్లో గెలిస్తే ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్‌… బీజేపీ హామీ  |   18 నెల‌ల జైలు జీవితం.. ఒక్క మాట‌తో వైఎస్సార్‌కు రాజీనామా లేఖ‌  |   కిడ్నాప్ చేసిన గంట‌లోనే హ‌త్య చేశారు.. ఆ భ‌యంతోనే..!  |   దీక్షిత్‌ను పొట్ట‌న పెట్టుకున్న కిడ్నాప‌ర్లు  |   మ‌ళ్లీ తెర‌పైన శ్రీహ‌రి, సౌంద‌ర్య‌ను చూసే అరుదైన‌ అవ‌కాశం  |   కేసీఆర్‌తో గొడ‌వ ఎక్క‌డ మొద‌లైందో చెప్పిన కోదండ‌రాం  |   ఆర్థిక ఇబ్బందుల్లో ప్ర‌ధాని.. ఈ క‌ష్టాలు ఎవ‌రికీ రావేమో..!  |   క‌ర్నూలు మ‌హిళ‌కు దొరికిన‌ కోటి రూపా‌యల వ‌జ్రం  |   బ్రేకింగ్‌: క‌రోనా వ్యాక్సిన్‌పై ప్ర‌ధాని మోడీ కీల‌క ప్ర‌క‌ట‌న‌  |  

హైదరాబాద్ లో కరోనా పరీక్షలను నిలిపివేసిన ప్రభుత్వం!

తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా ఉదృతంగా ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో 50 వేల కరోనా పరీక్షలు చేసేందుకు సంకల్పించింది. కాగా ప్రస్తుతం నిర్వహిస్తున్న కరోనా టెస్టులను తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇప్పటికే సేకరించిన కరోనా శాంపిల్స్ ల టెస్టింగ్ ప్రక్రియ ఇంకా పూర్తి కానీ నేపథ్యంలో రెండు రోజుల పాటు నగరంలో కరోనా శాంపిల్స్ ను సేకరించవద్దని ఆదేశించింది. ఈ మేరకు హైదరాబాద్ లో నేడు, రేపు కరోనా పరీక్షలు నిలిపివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. కాగా 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 891 కరోనా కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తుంది. తాజా కేసులతో తెలంగాణలో కరోనా కేసులు 10,444కి చేరుకున్నాయి. ఇందులో 5,858 ఆక్టివ్ కేసులు ఉండగా వీరందరిని వివిధ ఆసుపత్రుల్లో, ఐసోలేషన్ కేంద్రాల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 4,361 కాగా 225 మంది మరణించారు.

Related News