logo

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు మొద‌టి ర్యాంకు… తెలంగాణ‌కు..?

స్టేట్ బిజినెస్ రిఫార్మ్ యక్ష‌న్ ప్లాన్ – 2019(బీఆర్ఏపీ)లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు మొద‌టి స్థానం ద‌క్కింది. ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్ ఈ ర్యాంకుల‌ను ప్ర‌క‌టించారు. ఇందులో ఏపీకి మొద‌టిస్థానం ద‌క్కింది. 2017 – 18లో కూడా ఆంధ్ర‌ప్ర‌దేశ్ మొద‌టి స్థానంలోనే ఉండ‌గా ఇప్పుడు కూడా ఈ ర్యాంకును కాపాడుకుంది. గ‌త‌సారి 12వ ర్యాంకులో ఉన్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఈసారి బాగా పుంజుకొని రెండో స్థానాన‌న్ని ద‌క్కించుకుంది.

తెలంగాణ‌కు 2017 – 18లో రెండో స్థానం ఉండ‌గా ఈసారి ఒక స్థానాన్ని కోల్పోయి మూడో స్థానం ద‌క్కించుకుంది. నాలుగో స్థానంలో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఐదో స్థానంలో ఝార్ఖండ్‌, ఆరో స్థానంలో చ‌త్తీస్‌ఘ‌డ్‌, ఏడో స్థానంలో హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, ఎనిమిదో స్థానంలో రాజ‌స్థాన్ నిలిచాయి. పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించ‌డంలో ఈ రాష్ట్రాలు బాగా పని చేశాయ‌ని నిర్మలా సీతారామ‌న్ పేర్కొన్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌చ్చాక పెట్టుబ‌డిదారులను భ‌య‌పెడుతున్నార‌ని, పెట్టుబ‌డులు వెన‌క్కు వెళ్లిపోతున్నాయ‌ని ప్ర‌తిప‌క్ష పార్టీలు ప్ర‌చారం చేస్తున్నాయి. అయితే, అవ‌న్ని త‌ప్పుడు ప్రచారాలేన‌ని, కొత్త పెట్టుబ‌డులు తీసుకువ‌చ్చేందుకు అన్ని ప్ర‌య‌త్నాలూ చేస్తున్నామ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం చెబుతోంది. ఇప్పుడు కేంద్రం కూడా ఏపీకి ఈ విష‌యంలో నెంబ‌ర్ 1 ర్యాంకు ఇవ్వ‌డంతో ఏపీ ప్ర‌భుత్వంపై ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు తగ్గించేగ్గే అవ‌కాశం ఉంది.

Related News