తెలుగు సినిమాల్లో హాస్య బ్రహ్మగా పేరు పొందిన బ్రహ్మానందం లాక్ డౌన్ కాలాన్ని తన దైన శైలిలో గడిపారు. లాక్ డౌన్ లో ఆయన గీసిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయోధ్యలో రామ మందిర నిర్మాణం సందర్భంగా బ్రహ్మానందం ‘ఆంజనేయుని ఆనంద బాష్పాలు’ అంటూ గీసిన ఆంజనేయుడి చిత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.
ఈ హాస్య నటుడి నైపుణ్యం చూసి అంతా ఆశ్చర్యపోయారు. తాజాగా బ్రహ్మానందం కొత్త సంవత్సరం సందర్భంగా హీరో అల్లు అర్జున్, దగ్గుబాటి రానాలకు తన స్వహస్తాలతో గీసిన వెంకటేశ్వర స్వామి చిత్రాలను బహుమానంగా పంపాడు. వీటిని గీయడానికి బ్రహ్మానందం 45 రోజులపాటు కష్టపడ్డారట. వీటిని అందుకున్న ఈ యంగ్ హీరోలు సంతోషంతో పొంగిపోయారు. తమకిది వెలకట్టలేని విలువైన బహుమతి అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లతో తమ ఆనందాన్ని పంచుకున్నారు.
THE MOST PRICELESS GIFT I RECEIVED FROM OUR BELOVED
BRAHMANANDAM GARU.
45 DAYS OF WORK .
HAND DRAWN PENCIL SKETCH . THANK YOU ❤ #AlluArjun #Pushpa @alluarjun pic.twitter.com/rkqY6D8FEi— TelanganaAlluArjunFC (@TelanganaAAFc) January 1, 2021