logo

  BREAKING NEWS

బీజేపీ పార్టీలోకి తెలంగాణ ఫైర్ బ్రాండ్?… క్లారిటీ వచ్చేసింది!  |   మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్: చరిత్ర మరువని రియల్ హీరో స్టోరీ!  |   8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |   బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల: గ్రేటర్ ప్రజలపై వరాల జల్లు!  |   ఎడ‌మ చేతివాటం ఎందుకు వ‌స్తుంది ? వారిలో తేడా ఏముంటుంది ?  |   ఏబీ వెంకటేశ్వర్ రావుకు సుప్రీంలో షాక్..!  |   జ‌గ‌న‌న్న తోడు.. పేద‌ల‌కు రూ.10 వేలు.. ఇలా పొందాలి  |   ‘దమ్ముంటే కూల్చరా’.. అక్బరుద్దీన్ కు బండి సంజయ్ సవాల్!  |   మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే వారిని తరిమికొడతాం .. పాతబస్తీపై బండి సంచల వ్యాఖ్యలు  |  

గుంటూరు వైద్యుల ఘనత: బిగ్ బాస్ షో చూపించి ప్రాణాలు దక్కించారు!

బిగ్ బాస్ రియాలిటీ షోకి ఎంత మంది ప్రేక్షకులు అభిమానులయ్యారో తెలిసిందే. తాజాగా బిగ్ బాస్ షో ఓ వ్యక్తి ప్రాణాలు నిలిపింది. గుంటూరు జిల్లాకు చెందిన బత్తుల వరప్రసాద్‌ బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగి. మూడేళ్ళ క్రితం అతనికి బ్రెయిన్ లో ట్యూమర్ ఉన్నట్టుగా వైద్యులు గుర్తించారు.

ఆపరేషన్ ద్వారా ఆ ట్యూమర్ ను తొలగించారు. కానీ మళ్ళీ కొద్ది రోజుల క్రితం వర ప్రసాద్ కు ఫిట్స్ రావడం మొదలైంది. దీంతో మరోసారి వైద్యులు పరీక్షించగా మరో 3 సెంటీమీటర్ల ట్యూమర్ ను గుర్తించారు. మెడ, కాలు భాగానికి సంబందించిన నరాలు ఉన్న దగ్గర ఈ ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి రోగి మెళుకువతోనే ఉండాలి.

కేవలం మెదడుకు మాత్రమే మత్తు మందు ఇచ్చి ఈ ఆపరేషన్ చేయాలన్నారు. దీంతో అతను ఆపరేషన్ సమయంలో భయపడకుండా ఉండేందుకు అతనికి ఇష్టమైన బిగ్ బాస్ షోను చూపిస్తూ ఆపరేషన్ ను చేసారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ ప్రక్రియలో బిగ్ బాస్ షో తో పాటుగా ‘అవతార్’ సినిమాను చూస్తూ వర ప్రసాద్ ప్రాణాలు కాపాడుకున్నాడు.

గుంటూరులోని కొత్తపేటలో ఉన్న బృంద న్యూరో సర్జన్ సెంటర్ వైద్యులు ఈ అరుదైన శస్త్ర చికిత్సను చేసారు. ప్రస్తుతం వర ప్రసాద్ ఆరోగ్యంగానే ఉన్నాడని ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తలేవని డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి వైద్య బృందం పేర్కొంది.

Related News