ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నెలకొన్న విషయం తెలిసందే. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. స్పీకర్ తమ్మినేని తీరుపై అసహనం వ్యక్తం చేసారు. తాజాగా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి రాష్ట్ర పురపాలక మంత్రి బొత్స సత్యనారాణయన స్పందించారు.
ప్రతిపక్ష నేతగా చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారన్నారు. రాజకీయ లబ్ది కోసమే చంద్రబాబు తాపత్రయపడుతున్నారు. సభలో స్పీకర్ కు కనీస గౌరవ ఇవ్వకుండా ఆయనను ఏక వచనంతో పిలుస్తూ అవమానించారు. పోడియంను చుట్టుముట్టే ప్రయత్నం చేసారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టినప్పుడు చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం ఏమైంది? అని బొత్స ప్రశ్నించారు.
స్పీకర్ పై బెదిరింపులకు దిగారు.ఆయనపై వ్యక్తిగత దూషణలకు దిగి సభా సాంప్రదాయాలను అపహాస్యం చేసారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధితో పాటుగా సంక్షేమ పథకాల గురించి వివరించాము. ఒక్క ఏడాదిన్నర పాలనలోనే 5 కోట్ల 65 లక్షల మంది లబ్దిదారులకు రూ. 67 వేల కోట్లను తమ ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు.
పోలవరంపై ఎల్లో మీడియా కావాలనే తప్పుడు ప్రచారం చేసినదన్నారు. అసెంబ్లీ సాక్షిగా పోలవరం ఎత్తు ఒక్క అంగుళం కూడా తగ్గలేదని సీఎం జగన్ చెప్పినట్టుగా బొత్స పేర్కొన్నారు. ప్రతిపక్షాలు మాట్లాడేందుకు ఇచ్చిన సమయాన్ని కూడా వాళ్ళ భజనకే ఉపయోగించుకున్నారన్నారు.