logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

సినిమా తెచ్చిన వివాదం: రాజమౌళిపై మండిపడుతున్న బోణీ కపూర్!

టాలీవుడ్ దర్శకుడు రాజమౌళిపై బాలీవుడ్ నిర్మాత, శ్రీదేవి భర్త బోణి కపూర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి ఇలా చేస్తాడనుకోలేదంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేసారు. అయితే ఈ దర్శక నిర్మాతల మధ్య విబేధాలు రావడానికి ‘ఆర్ఆర్ఆర్’ సినిమానే కారణం అయ్యింది.

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో రాజమౌళి తెరకెక్కిస్తున్న ఫ్యాన్ ఇండియా సినిమాను అక్టోబర్ 13 న విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే అదే సమయానికి బోణి కపూర్ నిర్మిస్తున్న ‘మైదాన్’ సినిమా కూడా రిలీజ్ కు సిద్ధమైంది. అక్టోబర్ 15 న మైదాన్ విడుదల కావలసి ఉంది. దీంతో రెండు సినిమాలకు మధ్య క్లాష్ ఏర్పడింది. భారీ బడ్జెట్ తో ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల సమయంలో ఇతర సినిమాలను విడుదల చేయడానికి ఎవరూ ఇష్టపడరు.

కానీ తన సినిమా విడుదల తేదీని ఆరు నెలల ముందుగానే ప్రకటించానని కరోనా కష్టకాలంలో కలిసి నడవాల్సిన సమయంలో రాజమౌళి ఇలా చేయడం పై తాను చాలా అప్ సెట్ అయ్యానని అయన మీడియా కు వివరించారు. అయితే మైదాన్ సినిమా లో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ నటిస్తున్నారు. అటు ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఆర్ఆర్ఆర్ సినిమా విషయమై బోణీ కపూర్ అజయ్ దేవగన్ తో రాజమౌళికి రాయబారం కూడా పంపాడట. నేను నటించిన మైదాన్ సినిమా అక్టోబర్ 15 న విడుదల అవుతుంది. మీరు ఓసారి బోణీ కపూర్ తో మాట్లాడండి అని రాజమౌళిని అజయ్ కోరినా జక్కన్న ఆ మాటలు పట్టించుకోకుండా చివరకు అక్టోబర్ 13 నే సినిమా విడుదల ను ఖరారు చేశారనే టాక్ కూడా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది.

Related News