logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

వారం రోజులపాటు బోన్ సూప్ తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

బోన్ సూప్ ను చికెట్, మటన్, బీఫ్ ఎముకలతో తయారు చేస్తారు. గాయాలు త్వరగా మానడానికి, అనారోగ్యానికి గురైన వారు వేగంగా కోలుకోవడానికి బోన్ సూప్ తాగిస్తారు. ఇందులో ఉండే పోషకాలే అందుకు కారణం. బోన్ బ్రోత్‌గా పిలిచే ఎముకల రసం తాగడం వల్ల ఒంట్లోని విషతుల్యాలు బయటకు వెళ్తాయి. అనేక అనారోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కీళ్ల సంబంధ సమస్యలు దూరం అవుతాయి. ఇవే కాక ఇంకా ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..

బోన్ సూప్ లో ఎన్నో రకాల న్యూట్రీషియన్స్ ఉంటాయి. ఇవి మన వ్యాధినిరోధకశక్తిని పెంచడానికి ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఎముకలు బలపడటానికి బోన్ సూప్ ఎంతో సహకరిస్తుంది. ఎముకల నుంచి కాల్షియం తగ్గిపోకుండా కాపాడుతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ కీళ్ల మధ్యన ఉండే జెలాటిన్ తగ్గిపోతుంది. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి రాపిడికి గురవుతాయి. జంతువుల శరీరంలో ఈ జెలటిన్ ను ఉప్పత్తి చేసే ప్రోటీన్లు అధికంగాఉంటాయి. వాటిని సూప్ రూపంలో తీసుకోవడం వలన జాయింట్స్ ను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా నొప్పిని నివారిస్తుంది. ఒక కప్పు బోన్ సూప్ లో డయేరియా, మలబద్ధకం సమస్యలను నివారించే అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి.

అంతేకాదు ప్రేగు రంధ్రాలను చొచ్చుకుపోకుండా చేస్తుంది. ఇందులో గ్లైసిన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. సాధారణంగా అనారోగ్యంగా ఉన్నప్పుడు మన శరీరం ఈ అమైనో యాసిడ్ ను ఉత్పత్తి చేయడం ఆపేస్తుంది. అందుకే బోన్ సూప్ ను తీసుకోవడం వలన శరీరానికి అవసరమైన శక్తి సమకూరుతుంది. ఇది నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది. ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని పెంచుతుంది. మనశరీరంలో అతి ముఖ్యమైన అవయవాలలో లివర్ కూడా ఆ ఒకటి. మద్యం తాగడం, ఇతర కారణాల వల్ల డ్యామేజ్ అయిన లివర్ సెల్స్ ను తిరిగి ఉత్పత్తి చేయగలదు. గాయాలు త్వరగా మానడానికి సహకరిస్తుంది. హార్మోన్ సమస్యలతో బాధపడే స్త్రీలు బోన్ సూప్ ను డైట్ లో తప్పక చేర్చుకోవాలి. పురుషులలో వీర్య కణాల సంఖ్యను పెంచి సంతాన సమస్యలను దూరం చేస్తుంది.

బోన్ సూప్ లో ఉండే జెలాటిన్ ప్రోబయోటిక్స్ మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. అది ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియాతో పోరాడుతుంది. బోన్ సూప్ లో ఉండే మినరల్స్, విటమిన్స్ శరీరం త్వరగా గ్రహించుకుంటుంది. ఇందులో అత్యధిక మొత్తంలో కొల్లాజెన్ ఉండటం వలన చర్మం, గోర్లు , జుట్టు ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. బోన్ సూప్ తాగేవారికి వృద్ధాప్య ఛాయలు ఆలస్యంగా మొదలవుతాయి. ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. వారం రోజుల పాటలు బోన్ సూప్ ను తీసుకుంటే అది ఎన్నో రకాల సప్లిమెంట్లను సహజంగానే శరీరానికి అందిస్తుంది. మానసికంగా, శారీరకంగా వీక్ గా ఉన్నవారికి బోన్ సూప్ తాగిస్తే చాలా త్వరగా కోలుకుంటారు. అల్సర్, ఫుడ్ అలర్జీలతో బాధపడేవారికి బోన్ సూప్ దివ్యౌషధం. ఒంట్లో పేరుకుపోయిన టాక్సిన్లను తొలగిస్తుంది. బోన్ సూప్ తాగడం వల్ల మంచి బ్యాక్టీరియాను పెంచి పొట్టలోని క్రీములను తొలగిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుగుస్తుంది.

Related News