logo

  BREAKING NEWS

బ‌జాజ్ చేత‌క్ మ‌ళ్లీ వ‌చ్చేసింది.. ధ‌ర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు  |   హ‌మ్మ‌య్య‌… ఆ వ్యాక్సిన్‌లు కూడా వ‌చ్చేస్తున్నాయి  |   మీ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయ్యిందా? మీ డేటా ఎక్కడైనా లీక్ అయ్యిందా? ఇలా తెలుసుకోండి  |   తగ్గిన బంగారం ధరలు 14.04. 2021 నాటి బంగారం, వెండి ధరలు  |   మళ్ళీ పెరిగిన బంగారం ధరలు 13.04.2021 నాటి బంగారం, వెండి ధరలు  |   శుభవార్త: భారత్ లో మరో వాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్!  |   కరోనా సెకండ్ వేవ్: ఎక్కువ మందిలో బయటపడుతున్న లక్షణం ఇదే  |   బ‌ట్ట‌లు లేకుండా అమ్మాయిలు వీడియో కాల్ చేస్తారు టెంప్ట్ అయితే మీ ప‌ని ఖ‌తం  |   హలీమ్ తింటే బరువు పెరుగుతారా?  |   ఆ నాలుగు ప్రాంతాల్లోనే కుంభమేళా ఎందుకు? కోట్ల ఖర్చుతో ఎందుకు నిర్వహిస్తారు?  |  

ఎముకలు ఉక్కులా మారాలంటే ఇవి తినాల్సిందే!

ఎముకలు ఆరోగ్యంగా ఉంటేనే మీరు ఎక్కువ కాలం యవ్వనంగా ఉండగలుగుతారు. అంతేకాక ఎముకలు లోపలి అవయవాలకు రక్షణ ఇచ్చి కండరాలను ధృడంగా మారుస్తాయి. అందుకోసం కాల్షియం ఎంతో అవసరమన్న విషయం తెలిసిందే. వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకలు బలహీనంగా మారతాయి. ముఖ్యంగా మహిళల్లో 30 ఏళ్లు దాటుతుండగానే ఈ సమస్య మొదలవుతుంది.

కాల్షియంతో పాటుగా ఎముకలు పెళుసుబారకుండా ఉండటానికి విటమిన్ -డి కూడా ఎంతో ముఖ్యం. ఈ రెండూ ఎముకల నిర్మాణాన్ని బలంగా ఉంచుతాయి. కాల్షియం లోపం ఉన్నవారిలో చిన్నవయములోనే ఎన్నో సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే కాల్షియం కోసం సప్లిమెంట్లపై ఆధారపడటం కంటే ఆహారంతోనే ఈ సమస్యను ఎదుర్కోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

పాలు, పెరుగు శరీరానికి అవసరమైన కాల్షియంను అందించడంలో ఎంతో ఉపయోగపడతాయి. వీటి ద్వారా పాస్ఫరస్ కూడా అందుతుంది. అలాగే కొన్ని రకాల ఆకు కూరల్లో మెగ్నీషియం, పొటాషియం కూడా లభిస్తుంది. పప్పు ధాన్యాలు, పాల పదార్థాల నుంచి మాంసకృత్తులు అందుతాయి. విటమిన్ డి కోసం రోజులో కొంత సేపు పగటి పూట ఎండలో గడిపితే సరిపోతుంది. అయితే ఎక్కువ మోతాదులో ఉప్పు, కూల్ డ్రింక్స్, మాంసాహారం, కాఫీ తాగడం, పొగాకు వాడటం, శారీరక శ్రమ లేకపోవడం వలన ఎముకలు పెళుసుబారే అవకాశం అధికంగా ఉంటుంది.

ప్రతి రోజూ తెలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల కూడా ఎముకలు ధృడంగా మారతాయి. రోజుకి రెండు సార్లు టమాటో జ్యుస్ ను తాగడం వల్ల ఎముకలకు అవసరమైన కాల్షియం పుష్కలంగా అందుతుంది. పాలకూరలో ఎముకల దృఢత్వానికి అవసరమైన అన్ని పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. సిట్రస్ పండ్లు ఎముకల ఆరోగ్యానికి మంచి ఆహారం. బత్తాయి, నిమ్మ, ద్రాక్షలలో ఉండే సి విటమిన్ కాల్షియంను ఇవ్వడమే కాకుండా రోగనిరోధకశక్తిని పెంపొందిస్తాయి. వీటితో పాటుగా అధిక బరువును తగ్గించుకోవాలి. లేదంటే ఇది నాలుగు రెట్ల అధిక బరువును ఎముకలపై వేసి భవిష్యత్తులో అస్టిరియోపోరోసిస్ వ్యాధి బారిన పడేలా చేస్తాయి.

Related News