ఎట్టకేలకు విరసం నేత వరవరరావుకు బాంబే హై కోర్టు బెయిలు మంజూరు చేసింది. ఏడాది క్రితం కోరేగావ్ కుట్ర కేసులో అరెస్టైన వరవరరావు జైలులో ఉన్న సమయంలో తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. ఈ క్రమంలో ముంబై లోని ఓ ఆసుపత్రిలో చేరి చికిత్స కూడా తీసుకున్నారు. దీంతో ఆయనకు బెయిలు మంజూరు చేయాలంటూ వారి కుటుంబ సభ్యులు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. తాజాగా వరవరరావు బెయిలు పిటిషన్ పై విచారణ జరిపిన బాంబే హై కోర్టు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. బీమా కోరేగావ్ కేసులో వావరరావును కీలక నిందితుడిగా ఎన్ఐఏ పేర్కొంది. ఈ కేసులో 2018 లో మొదటిసారిగా వరవరరరావు అరెస్టయ్యారు.