logo

  BREAKING NEWS

ఎన్నిక‌ల్లో గెలిస్తే ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్‌… బీజేపీ హామీ  |   18 నెల‌ల జైలు జీవితం.. ఒక్క మాట‌తో వైఎస్సార్‌కు రాజీనామా లేఖ‌  |   కిడ్నాప్ చేసిన గంట‌లోనే హ‌త్య చేశారు.. ఆ భ‌యంతోనే..!  |   దీక్షిత్‌ను పొట్ట‌న పెట్టుకున్న కిడ్నాప‌ర్లు  |   మ‌ళ్లీ తెర‌పైన శ్రీహ‌రి, సౌంద‌ర్య‌ను చూసే అరుదైన‌ అవ‌కాశం  |   కేసీఆర్‌తో గొడ‌వ ఎక్క‌డ మొద‌లైందో చెప్పిన కోదండ‌రాం  |   ఆర్థిక ఇబ్బందుల్లో ప్ర‌ధాని.. ఈ క‌ష్టాలు ఎవ‌రికీ రావేమో..!  |   క‌ర్నూలు మ‌హిళ‌కు దొరికిన‌ కోటి రూపా‌యల వ‌జ్రం  |   బ్రేకింగ్‌: క‌రోనా వ్యాక్సిన్‌పై ప్ర‌ధాని మోడీ కీల‌క ప్ర‌క‌ట‌న‌  |   ద‌సరా పండుగ రోజు జ‌మ్మి చెట్టుకు ఎందుకు పూజిస్తారో తెలుసా ?  |  

ముగ్గురు కుమార్తెలపై తండ్రి అత్యాచారం.. తల్లికి హైకోర్టు చివాట్లు

కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే తన ముగ్గురు కూతుర్లపై ఏళ్లుగా అత్యాచారానికి పాల్పతున్న దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అయితే ఈ విషయం తల్లికి తెలిసినా ఆమె కూడా తండ్రికే మద్దతిచ్చింది. అంతేకాకుండా ఈ విషయం బయటకు చెబితే ప్రాణాలు తీస్తానంటూ ముగ్గురు కూతుర్లను గదిలో బంధించింది. ఈ కేసు విచారణ చేపట్టిన హై కోర్టు ఈ విషయంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటనను తీవ్రంగా కలచివేసింది. ఈ తల్లి ప్రవర్తన ప్రకృతి విరుద్ధమంటూ కోర్టు వ్యాఖ్యానించింది. అంతేగాక ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న తల్లికి బెయిలు ఇవ్వడానికి ముంబై కోర్టు నిరాకరించింది.

సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటన మహారాష్ట్ర బీడ్‌ జిల్లాకు చెందిన కాజీ పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్న నిందితుడికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మర్చి 31వ తేదీన అతను 20 ఏళ్ల తన పెద్ద కుమార్తెపై అత్యాచారం చేసాడు. దీంతో ఇద్దరు చిన్న కూతుర్లు ఏడుస్తూ గొడవ చేసారు. తల్లిదండ్రులిద్దరూ కలిసి ముగ్గురు కూతుర్లను ఇంట్లో బంధించారు. ఎలాగోలా తమ స్నేహితుడి ద్వారా ఈ పోలీసులకు ఫిర్యాదు చేసారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితది ముగ్గురు కూతుర్లను గృహ నిర్బంధం నుంచి విడిపించారు. తల్లిదండ్రులిద్దరిని అరెస్టు చేసారు.

కాగా ఈ కేసులో బాధిత యువతులు తాము అనుభవించిన నరకం విని పోలీసుల కళ్ళు చెమర్చాయి. 2012 నుంచే తన తండ్రి అత్యాచారం చేసేవాడని పెద్ద కూతురు తెలిపింది. 18 ఎళ్లున్న రెండో కూతురిపై కూడా 5వ తరగతి చదువుతున్న సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇటీవల చిన్నకూతురిపై కూడా అదే విధంగా అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ విషయం తల్లికి తెలిసి కూడా ఆమె భర్తకు సహకరించింది.

అయితే జడ్జి ముందు మాత్రం తమ కూతుర్లు చెడు తిరుగుళ్లకు అలవాటు పడ్డారని ఆ విషయంపై మందలించినందుకు ఇలా ప్రవర్తిస్తున్నారని తెలిపింది. కన్న కూతుర్లపై తల్లి చేస్తున్న ఆరోపణలకు కోర్టు విస్తుపోయింది. ఈమె మాటలు ప్రకృతి విరుద్ధంగా ఉన్నాయి. ఏ కూతురు కూడా తల్లితండ్రులపై ఇలాంటి ఆరోపణలు చేయదు. ఒకవేళ పెద్ద కూతురు అబద్దం చెబితే ఆమె ఇద్దరు సోదరులు ఆమెకు సహకరించరని కోర్టు స్పష్టం చేసింది.

Related News