ప్రపంచంలోనే అరుదైన కట్టడాలలో ఒకటైన తాజ్ మహల్ కు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. బెదిరింపు కాల్ రావడంతో అప్రమత్తమైన పోలీసులు తాజ్ మహల్ పరిసర ప్రాంతాలను ఖాళీ చేయించారు. టూరిస్టులకు అనుమతులు రద్దు చేశారు. సీఎస్ ఎఫ్సీఐఎస్ఎఫ్, స్థానిక పోలీసు బలగాలు అక్కడ భారీగా మోహరించాయి.
ఉత్తరప్రదేశ్ పోలీస్ ఎమర్జెన్సీ నంబర్ అయిన 112 కి కాల్ చేసిన దుండగులు తాజ్ మహల్ లో బాంబు పెట్టినట్లుగా చెప్పారు. అది ఏ క్షణమైనా పేలవచ్చని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పోలీసులు బలగాలు తాజ్ మహల్ ను మోహరించి అక్కడ సెర్చ్ ఆపరేషన్ ను నిర్వహించాయి అనంతరం లోపల ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని ధృవీకరించారు. కాగా ఈ ఘటనపై ఆగ్రా ఐజీ సతీష్ గణేష్ స్పందించారు. అదొక ఫేక్ కాల్ గా పేర్కొన్నారు. అయితే ఈ కాల్ ఎక్కడి నుంచి వచ్చింద అనే కోణం లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.