logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

బన్నీ సినిమాకు బాలీవుడ్ దర్శకుడు ఫిదా.. ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ రిక్వెస్ట్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అల..వైకుంఠపురములో’ సినిమా టాలీవుడ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ రాబట్టింది. అంతేకాక పలు చోట్ల నాన్-బాహుబలి రికార్డ్స్ కూడా కొల్లగొట్టిందని టాక్. ఈ సినిమాలో నటించిన పూజ హేగ్దే కూడా ఇపుడు స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఈ సినిమాలో మధ్యతరగతి యువకుడిగా బన్నీ నటనకు విమర్శకుల ప్రశంసలందుకున్నాడు.

అయితే ఈ సినిమా కు బాలీవుడ్ దర్శకుడు ఒకరు ఫిదా అయ్యారు. అంతేకాదు తనకు బన్నీతో ఓ సినిమా అవకాశం కావాలని బహిరంగంగానే తన కోరికను వెళ్లబుచ్చాడు. బాలీవుడ్ లో కాబిల్, షూటౌట్ ఎట్ లోఖండ్‌వాలా, జజ్బా లాంటి సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు సంజయ్ గుప్త మంచి గుర్తింపు తెచ్చుకున్నారు . ఆయన ఇటీవల అల్లు అర్జున్ నటించిన అల .. వైకుంఠపురం సినిమాను చూశారట. చూసిన వెంటనే అల్లు అర్జున్ ను ప్రశంశిస్తూ ఓ ట్వీట్ చేసారు.

‘ అల వైకుంఠపురములో సినిమాను ఇప్పుడే చూశాను. అద్భుతమైన సినిమా. కరోనా భయం పోగానే వీలైనంత త్వరగా ఈ సినిమాను థియేటర్‌లో చూడాలి’ అని తెలిపారు. అయితే బన్నీ సంజయ్ ట్వీట్ కు స్పందిస్తూ.. మీకు నా సినిమా నచ్చడం సంతోషంగా ఉంది సంజయ్ గారు. థాంక్యూ వెరీ మచ్ అని ధన్యవాదాలు తెలిపాడు. అందుకు బదులిస్తూ… మీరు ఈ సినిమాతో నన్ను అన్ని అనుభూతులకు లోనయ్యేలా చేశారు. మీతో పనిచేసే ఒక్క అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను అంటూ ట్వీట్ చేసారు. మరి ఈ దర్శకుడి రిక్వెస్ట్ కి బన్నీ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Related News