logo

  BREAKING NEWS

క‌రోనా బాధితుల‌కు గ్రీన్ ఫంగ‌స్ ముప్పు..లక్ష‌ణాలు, జాగ్ర‌త్త‌లు ఇవే  |   FACK CHECK: క‌రోనా వ్యాక్సిన్ వేసుకుంటే శ‌రీరం అయ‌స్కాంతం అవుతుందా ?  |   కేతిరెడ్డికి జ‌గ‌న్ బంప‌ర్ ఆఫర్.. షాక్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు  |   క‌రోనా వ్యాక్సిన్ వేసుకున్నాక ఈ ప‌నులు అస్స‌లు చేయ‌కండి  |   గుడ్ న్యూస్‌.. ఆ వ్యాక్సిన్ సామ‌ర్థ్యం 90 శాతం  |   నెయ్యి తింటే లావుగా అవుతారా ? నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాదా ?  |   అరుదైన రికార్డు సొంతం చేసుకోనున్న బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి  |   కేసీఆర్ మాస్ట‌ర్‌స్ట్రోక్‌.. హుజురాబాద్‌లో ఈట‌లకు క‌ష్ట‌మే  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వేరు జెండా.. కుప్పంలో కొత్త డిమాండ్‌  |   పెట్రోల్‌లో 20 శాతం ఇథ‌నాల్‌.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర.. మ‌రెన్నో లాభాలు  |  

ఎమ్మెల్సీగా బొగ్గారపు దయానంద్.. కేసీఆర్ వ్యూహం అదే?

ఖాళీగా ఉన్న ప్రభుత్వ నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులను భర్తీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరెటి వెంకన్న, మాజీ మంత్రి, రజక సంఘం జాతీయ నాయకుడు బసవరాజు సారయ్యల పేర్లు ఖరారు చేసారు కేసీఆర్. వారితో పాటుగా బొగ్గారపు దయానంద్ ను కూడా ఎమ్మెల్సీగా నియమించనున్నారు.

గోరెటి వెంకన్న, బసవరాజు సారయ్యలు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులుగా ప్రజలకు పరిచయం అక్కరలేని పేర్లు. కానీ బొగ్గారపు దయానంద్ ఎవరనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వ్యక్తికి ఎమ్మెల్సీ పదవిని ఇవ్వడం వెనుక కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించారనే చర్చ నడస్తుంది.

బొగ్గారపు దయానంద్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన దగ్గర పని చేసిన వ్యక్తిగా చెప్తారు. అలాగే ఆర్య వైశ్య సంఘం నాయకుడిగా ఆ సామాజికవర్గంలో గొప్ప పేరుంది. ఆయనను వివాద రహితుడిగా పిలుస్తారు. ఆ సామాజిక వర్గంలో ప్రముఖులుగా చెప్పుకునే వ్యక్తులకన్నా బొగ్గారపు దయానంద్ ఎంతో సీనియర్ నేత. కానీ మీడియా ఫోకస్ ఎక్కువగా లేకపోవడంతో అయన గురించి బయటకు తెలియకుండా పోయింది.

బీఎస్సి పట్టభద్రుడైన దయానంద్ హైద్రాబాద్ వాసి. ఉమ్మడి రాష్ట్రంలో సాధారణ శాఖలో ఉప సంచాలకుడిగా పని చేసి 2003 లో రిటైర్ అయ్యారు. 2014 లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం వ్యాపారవేత్తగా ఉన్నారు. వాసవి సేవా కేంద్రానికి జీవితకాల సలహాదారు. ఆర్థికంగా కూడా ఎంతో పలుకుబడి ఉన్న వ్యక్తి. కానీ ఎంతోకాలంగా పార్టీలో ఉన్నా తగిన గుర్తింపు రాలేదనే అసంతృప్తి ఆయనలో ఉంది.

మరికొన్ని రోజుల్లో గ్రేటర్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో దయానంద్ నియామకం ఆర్యవైశ్య సామాజిక వర్గాల్లో కలిసొస్తుందని కేసీఆర్ భావించినట్టు తెలుస్తుంది. అంతేకాదు తమ సామాజిక వర్గం వారికి రాజకీయ పార్టీల నుంచి సరైన ఆదరణ లేదని, ఎన్నికల సమయంలో మాత్రమే తమను వాడుకుంటారనే ఆగ్రహం ఆర్యవైశ్యుల్లో ఉంది. ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకునే కేసీఆర్ ముందు చూపుతో వ్యవహరించినట్టుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related News