ఇప్పటి వరకు మనమంతా వైట్ రైస్, బ్రౌన్ రైస్ గురించే విన్నాం. అవే తింటున్నాం కూడా. అయితే మనదేశంలో బ్లాక్ రైస్ ఉన్నట్టు ఎంత మందికి తెలుసు. నల్లని రంగులో ఉండే ఈ బియ్యపు గింజలకు ఎందుకింత డిమాండ్? ఓసారి వీటి గురించి తెలుసుకుందాం..
ఈ నల్ల బియ్యం ఇప్పటివి కావు. వేద కాలం నుంచి వీటికి ఎంతో ప్రాధాన్యం ఉంది. వీటినే కృష్ణ బియ్యం అని కూడా పిలుస్తారు. ప్రాచీన గ్రంథాల్లో ఈ కృష్ణ బియ్యం ప్రధాన్యత గురించి అనేక సందర్భాలలో వివరించారు. వీటిని యజ్ఞాలు, ఇతరపండుగల సందర్భాలలో ఉపయోగించేవారు. ప్రాచీన భారతీయులకు ఈ బియ్యం ప్రాముఖ్యత, వాటి లక్షణాలు, ఆరోగ్య ప్రయోజనాలు తెలుసు. కానీ ఇప్పటివారికి వీటి గురించి అంతగా తెలియదు. మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వీటికి అధికంగా ఉపయోగిస్తారు. చైనీయులు ఈ కృష్ణ బియ్యాన్ని బలాన్నిచ్చే ఆహారంగా తీసుకుంటారు. వీటిని నేరుగా అన్నం లాగ తినకపోయినా కొన్ని ముఖ్యమైన ఆహార పదార్థాలతో కలిపి వండుతారు.
హైదరాబాద్ ఫెమస్ అయిన హలీం తయారీలోనూ ఈ నల్ల బియ్యాన్ని వాడుతారు. శతాబ్దాలుగా బ్లాక్ రైస్‌ను అధికంగా పండించే మణిపూర్‌కి ఇటీవల అరుదైన గుర్తింపు లభించింది. చఖావో రకం బియ్యానికి జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ కూడా వచ్చింది. ఈ రైస్ మనకు కూడా మార్కెట్లో దొరుకుతాయి. కానీ వీటి గురించి తెలియకపోవడంతో కొనేందుకు అంతగా ఆసక్తి చూపరు.
నల్ల బియ్యం లో ఉండే పోషక విలువల గురించి తెలిసిన వారు వీటిని కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకుని వాడతారు. ఇందులో బి 12, బి6 విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. నల్ల బియ్యం మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్స్ క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది. క్యాన్సర్ కు కారణమయ్యే కణతులను తొలగిస్తుంది. హృద్రోగ సమస్యలతో బాధపడేవారు బ్లాక్ రైస్ ను ఉపయోగించడం వల్ల గుండెకు సంబందించిన వ్యాధుల నుండి రక్షిస్తుంది. ఈ నల్ల బియ్యం కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
అంతేకాదు ప్రస్తుత కాలంలో ఎంతో కీలకమైన వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. రక్తంలో చక్కర స్థాయిలను తగ్గించి మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తాయి. బరువు తగ్గాలని అనుకునే వారు వీటిని ప్రయత్నించవచ్చు. శరీరంలో అధిక కొవ్వు చేరకుండా చూస్తుంది. జుట్టు బలహీనంగా మారి, ఊడిపోతుంటే నల్ల బియ్యాన్ని ఉడికించిన గంజిని తలకు పట్టించి ఆరిన తర్వాత కడిగేయాలి. ఇళ్ల తరచూ చూస్తే జుట్టు కుదుళ్లు బలంగా మారతాయి. ఈ గంజిని యాక్నే సమస్యలతో బాధపడేవారు ముఖానికి ఫేస్ ప్యాక్ లాగా ఉపయోగించవచ్చు.