logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

మరో ప్రాణాంతక వ్యాధి: కరోనా పేషంట్లలో ‘బ్లాక్ ఫంగస్’.. భారత్ లో కేసులు!

కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుని సాధారణ జీవితం మొదలు పెడుతున్న వారిని ఇప్పుడు మరో వార్త కలవరపెడుతుంది. ఉత్తర భారతంలో ఇప్పుడు కరోనా కన్నా డేంజరస్ వ్యాధి ప్రబలుతోంది. ఇది కరోనా సోకిన వారిపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది. అంతే కాకండా ఇది సోకిన వారు బ్రతికే అవకాశాలు 50 శాతం మాత్రమే అంటున్నారు వైద్యులు. ‘బ్లాక్ ఫంగస్’ గా పిలుస్తున్న ఈ వ్యాధిపై అధికారులు అప్రమత్తమవుతున్నారు. ముఖ్యంగా వృద్దులు, కరోనా నుంచి కోలున్నవారు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వ్యాధి లక్షణాలను తొందరగా గుర్తించగలిగితే చికిత్స ద్వారా బయటపడవచ్చు లేదంటే ఈ ఫంగస్ సోకిన వారు మరణించే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాధికి గల కారణాలు, లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం..

గుజరాత్ లోని అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ నగరాలలో ఓ వింత వ్యాధి ప్రబలి పదుల సంఖ్యలో రోగులు మరణించారు. మరికొంత మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రోగుల లక్షణాలను పరిశీలించిన వైద్యులు గుజరాత్ ఆరోగ్య శాఖకు మరో పిడుగులాంటి వార్త వినిపించారు. మరణించిన వారిపై బ్లాక్ ఫంగస్ దాడి చేసినట్టుగా వైద్యులు వెల్లడించారు. దీంతో అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ ప్రజలను, వైద్యులను జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అహ్మదాబాద్ తో పాటుగా దేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్య రాధాదాని ముంబై లలో కూడా ఈ తరహా కేసులు బయటపడుతుండటంతో ఆయా ప్రాంతాల్లో అలజడి రేగుతుంది. కరోనా మహమ్మారి తరువాత ప్రపంచాన్ని వణికించే వ్యాధి ఇదేనని భావిస్తున్నారు.

ఎలా వ్యాపిస్తుంది?

మ్యూకోర్మైసెటీస్‌ శీలింద్రాల కారణంగానే ఈ బ్లాక్ ఫంగస్ వ్యాపిస్తుంది. అత్యంత అరుదైన ఈ వ్యాధి చాలా ప్రమాదకరమైనదని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ వ్యాధి సోకిన వారు మరణించే అవకాశాలు 50 శాతం ఉంటాయి. అంటే 100 మందికి ఈ వ్యాధి వ్యాపిస్తే అందులో 50 మంది మరణించే ప్రమాదం ఉంది. అందుకే దీనిని కరోనా కన్నా డేంజరస్ వ్యాధిగా చెప్తున్నారు. బ్లాక్ ఫంగస్ వ్యాధి ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిందేమీ కాదు. అయినా గతంలో ఎన్నడూ లేనన్ని కేసులు ఇప్పుడు వెలుగు చూస్తుండటం ఆందోళన కలిగిస్తుంది.

ఈ వ్యాధి లక్షణాలు :
పాడైపోయిన ఆహార పదార్థాలు పై ఉండే నల్లటి బూజులోనే ఈ ఫంగస్ పుడుతుంది. ముందు గాలి ద్వారా ఇది వాతావరణంలో చేరుతుంది. ముక్కు ద్వారా మన శరీరంలోకి చేరుతుంది. ఈ వ్యాధి సోకిన వారిలో మొదట తలనొప్పి మొదలవుతుంది. ఆ తర్వాత ముక్కు కారుతుంది. ముక్కు నుంచి ఈ ఇన్ఫెక్షన్ కళ్ళకు కూడా వ్యాపిస్తుంది. అప్పుడు కళ్ళు దురద పెట్టి ఎర్రగా మారతాయి. కళ్ళ చుట్టూ ఉండే కండరాలపై ఈ ఫంగస్ ప్రభావం చూపితే కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తుల వ్యవస్థను నాశనం చేస్తుంది. శరీరంలోని అన్ని అవయవాలపై ఈ వ్యాధి ప్రభావం చూపగలదు. వ్యాధి లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే ఇన్ఫెక్షన్ మెదడుకు చేరి మెదడు వాపు కలుగజేస్తుంది. ఫలితంగా ఆ వ్యక్తి మరణిస్తాడు.

ఎవరికి ఎక్కువ ప్రమాదం..?
సాధారణంగా ఈ బ్లాక్ ఫంగస్ వ్యాధి శరీరంలో షుగర్ లెవల్స్ అధికంగా ఉన్నవారికి, క్యాన్సర్ చికిత్సలలో భాగంగా కీమోథెరపీ చేయించుకురావారికి, ఏదైనా ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్నవారికి, వృద్దులలో అధికంగా కనిపిస్తుంది. అయితే కరోనా సోకిన వారిలో రోగ నిరోధక శక్తి తగ్గిపోయి వారు పూర్తిగా నీరసంగా మారిపోతారు. అలాంటి వారిలో ఈ ఫంగస్ తేలికగా వ్యాపిస్తుంది. శరీరంపై కాలిన గాయాలు, గాట్లు ఉంటె కూడా ఇది వారి శరీరంలోకి వెళుతుంది. అన్నిటికన్నా ఎక్కువగా ముక్కు ద్వారానే వ్యాపిస్తుంది. దీంతో వృద్దులు, కరోనా నుంచి కోలుకున్నవారు, రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

కరోనా సోకిన వారిలో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. అలాంటి వారిపై ఈ ఫంగస్ దాడి చేస్తే మరణించే అవకాశం ఉంది. అయితే ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. అలాగే జంతువుల నుంచి కూడా వ్యాపించే అవకాశం లేదని వైద్యులు పేర్కొనడం కొంత ఊరటనిచ్చే విషయం. కేవలం శీలింద్రాలు ఉన్న ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఈ ఫంగస్ సోకుతుంది. అందుకే ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, తాజా ఆహారం మాత్రమే తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

 

 

 

Related News