logo

  BREAKING NEWS

8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |   బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల: గ్రేటర్ ప్రజలపై వరాల జల్లు!  |   ఎడ‌మ చేతివాటం ఎందుకు వ‌స్తుంది ? వారిలో తేడా ఏముంటుంది ?  |   ఏబీ వెంకటేశ్వర్ రావుకు సుప్రీంలో షాక్..!  |   జ‌గ‌న‌న్న తోడు.. పేద‌ల‌కు రూ.10 వేలు.. ఇలా పొందాలి  |   ‘దమ్ముంటే కూల్చరా’.. అక్బరుద్దీన్ కు బండి సంజయ్ సవాల్!  |   మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే వారిని తరిమికొడతాం .. పాతబస్తీపై బండి సంచల వ్యాఖ్యలు  |   కరోనా సెకండ్ వేవ్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!  |   మహిళల భద్రతకు ‘అభయం’ యాప్.. ఎలా పనిచేస్తుంది? ప్రత్యేకతలేమిటి?  |  

ఆమె పేరు విని షాకవుతున్న జనం..!

కేరళ రాష్ట్రంలో వచ్చే నెలలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కాగా కొల్లామ్ కార్పొరేషన్ పరిధిలో బీజేపీ తరపున పోటీ చేస్తున్న ఓ మహిళా అభ్యర్థి పేరు విని అక్కడి ప్రజలు షాకవుతున్నారు. ఇంతకీ ఆమె పేరులో ఏముంది అంటే.. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని ఆమె తన పేరుగా మలుచుకున్నారు. ఈ మహిళా అభ్యర్థి పేరు కరోనా థామస్.

ఆమె తండ్రి థామస్ ఫ్రాన్సిస్ తనకు కవలలు పుట్టారన్న ఆనందంలో ఏదైనా సృజననాత్మకంగా ఉండే పేర్లు పెట్టాలని భావించారట. దీంతో కొడుకుకి కోరల్ అని కూతురికి కరోనా అని పేర్లు పెట్టేసారు. కానీ ఇప్పుడు ప్రపంచమంతా కరోనా వైరస్ బారిన పడటంతో ఆ పేరు బాగా ఫెమస్ అయిపొయింది. లాక్ డౌన్ సమయంలో ఈ పేరు ఆమెకు కొన్ని సార్లు చిక్కులు కూడా తెచ్చిపెట్టిందట.

అయితే ఇప్పుడు ఆ పేరే తనకు ఎన్నికల ప్రహారంలో ఫ్రీ పబ్లిసిటీ తెస్తుందంటున్నారు. కరోనా పేరు పెట్టుకున్న తాను కూడా డెలివరీ సమయంలో ఈ వైరస్ బారిన పడ్డట్టుగా పేర్కొన్నారు. కాగా తాను, తన బిడ్డ క్షేమంగా బయటపడ్డామన్నారు. రానున్న ఎన్నికల్లో ఈ పేరు తనకు విజయాన్ని తెచ్చిపెడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆమె.

Related News