logo

  BREAKING NEWS

మీ పిల్ల‌ల‌కు బండిస్తున్నారా ? జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి  |   ఆరియానా గ్లోరీకి బంప‌ర్ ఆఫ‌ర్‌.. మెగా హీరో సినిమాలో ల‌క్కీ ఛాన్స్  |   ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆ నోటిఫికేషన్ రద్దు!  |   బ్రేకింగ్: తాజ్ మహల్ కు బాంబు బెదిరింపు..!  |   మున్సిప‌ల్ ఎన్నిక‌లపై సీక్రెట్ స‌ర్వే.. రిజ‌ల్ట్ చూసి షాకైన జ‌గ‌న్‌  |   బంగారం కొనేవారికి బ్యాడ్‌ న్యూస్.. పెరిగిన బంగారం ధ‌ర‌లు  |   బ్రేకింగ్: నిమ్మగడ్డ వివాదాస్పద నిర్ణయానికి హైకోర్టు బ్రేకులు.. భారీ ఎదురుదెబ్బ!  |   ఆనాడు జగన్ ను అడ్డుకున్నారు.. బాబుపై ఏపీ మంత్రి ధ్వజం  |   మంత్రి కేటీఆర్ కు సవాల్.. ఓయూ క్యాంపస్ దగ్గర ఉద్రిక్తత!  |   హైటెన్షన్: చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు.. ఎయిర్పోర్టులో బైఠాయింపు!  |  

మాజీ మంత్రి జానారెడ్డికి ఊహించని షాక్.. బీజేపీ ప్లాన్ లో భాగమేనా?

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డికి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న జానారెడ్డి అనుచరుడు డాక్టర్ రవి కుమార్ నాయక్ పార్టీకి రాజీనామా ప్రకటించారు. బీజేపీలో చేరుతున్నట్టుగా ప్రకటించారు. మరికొన్ని రోజుల్లో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో జానారెడ్డికి ఇది ఊహించని షాక్ అంటున్నారు విశ్లేషకులు. అయితే ఈసందర్భంగా రవి కుమార్ జానా రెడ్డి, ఆయన కుటుంబంపై కీలక వ్యాఖ్యలు చేసారు.

కాంగ్రెస్ పార్టీలో కుటుంబ పాలన సాగుతుందన్నారు. ఢిల్లీలో సోనియా రాహుల్, ప్రియాంకా గాంధీ లాగానే నాగార్జున సాగర్ నియోజకవర్గంలో జానారెడ్డి కుటుంబ పాలనను ప్రోత్సహిస్తున్నారన్నారు. తాను జానారెడ్డి కోసం ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం లెక్కచేయకుండా వదులుకున్నానని అలాంటి నన్ను ఆయన పక్కనపెట్టారన్నారు. బీజేపీ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడినై తాను బీజేపీలో చేరుతున్నానన్నారు.

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నుంచి జానారెడ్డి బరిలోకి దిగనున్నారు. గత ఎన్నికల్లో కూడా ఈ స్థానం నుంచి ఆయనే గెలుపొందారు. మరోవైపు దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ ఇప్పుడు నాగార్జున సాగర్ ఎన్నికలను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో విజయ శాంతిని ఈ స్థానం నుంచి పోటీ చేయించేందుకు బీజేపీ ప్లాన్ చేస్తుంది. అయితే రవి కుమార్ రాజీనామా కూడా బీజీపీ ప్లాన్ లో భాగమేనని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

Related News