logo

  BREAKING NEWS

అమిత్ షా వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్!  |   ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తేనే కదా తెలిసేది: కేసీఆర్ పై అమిత్ షా  |   వ్యాయామం ఏ వయసు వారు ఎంతసేవు చేయాలి: డబ్ల్యూహెచ్వో మార్గదర్శకాలు  |   బ్రేకింగ్: మంత్రి పేర్ని నానిపై హ‌త్యాయ‌త్నం  |   తెలంగాణలో కరోనా అప్ డేట్.. కొత్తగా నమోదైన కేసులు ఎన్నంటే?  |   ‘సర్జికల్ స్ట్రయిక్స్’ అంటే ఏమిటి? ఎలాంటి సందర్భాలలో నిర్వహిస్తారు?  |   బీజేపీ పార్టీలోకి తెలంగాణ ఫైర్ బ్రాండ్?… క్లారిటీ వచ్చేసింది!  |   మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్: చరిత్ర మరువని రియల్ హీరో స్టోరీ!  |   8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |  

ఎన్నిక‌ల్లో గెలిస్తే ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్‌… బీజేపీ హామీ

క‌రోనా వైర‌స్‌తో ప్ర‌జ‌ల్లో నెల‌కొన్న భ‌యాందోళ‌న‌ల‌ను, వ్యాక్సిన్ ప‌ట్ల ప్ర‌జ‌ల్లో ఉన్న ఆశ‌ల‌ను ఎన్నిక‌ల కోసం ఉప‌యోగించుకునేందుకు అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్ర‌య‌త్నిస్తున్న విష‌యం తెలిసిందే. అమెరికాలోనే కాదు మ‌న దేశంలోనూ భార‌తీయ జ‌న‌తా పార్టీ క‌రోనా వ్యాక్సిన్‌ను ఎన్నిక‌ల్లో ఓట్లు రాబ‌ట్టేందుకు ఉప‌యోగించుకుంటోంది. బిహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించిన మేనిఫెస్టోలో ఈ హామీని చేర్చింది.

బిహార్ ఎన్నిక‌ల మీజేపీ మేనిఫెస్టోను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ విడుద‌ల చేశారు. పాంచ్ సూత్ర‌, ఏక్ ల‌క్ష్య‌, 11 సంక‌ల్ప్ పేరుతో ఈ మేనిఫెస్టోను రూపొందించారు. ఈ మేనిఫెస్టోలోనే క‌రోనా వ్యాక్సిన్‌కు సంబంధించి కూడా ఓ ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన హామీని ఇచ్చింది బీజేపీ. బిహార్ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ అధికారంలోకి వ‌స్తే ఐసీఎంఆర్ చేత అనుమ‌తి పొందిన క‌రోనా వ్యాక్సిన్‌ను ప్ర‌తి బిహారీకి ఉచితంగా అందిస్తామ‌ని హామీ ఇచ్చారు.

ఇవే కాకుండా బిహార్‌లో 19 ల‌క్ష‌ల మందికి ఉద్యోగాలు ఇస్తామ‌ని సైతం బీజేపీ హామీ ఇచ్చింది. బిహార్‌లో గ‌త ప‌దిహేనేళ్ల త‌మ ఎన్డీఏ పాల‌న‌లో రాష్ట్రంలో అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోంద‌ని బీజేపీ చెబుతోంది. కాగా, తాము గెలిస్తే 10 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇస్తామ‌ని ఆర్జేడీ నేత తేజ‌స్వీ యాద‌వ్ కూడా ఎన్నిక‌ల హామీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

Related News