logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

బీజేపీ నేత, రాజ్య సభ సభ్యుడికి కరోనా పాజిటివ్!

కరోనా వైరస్ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తుంది. అన్ని దేశాలు ఇప్పుడు ఈ వైరస్ భారిన పడి ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. భారత్ లోనూ ఈ మహమ్మారి విజృంభిస్తుంది. కాగా సామాన్యుల నుంచి ప్రముఖుల దాకా అందరూ ఈ వైరస్ భారిన పడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల సినీ, రాజకీయ ప్రముఖులు కూడా కరోనాకు బలయ్యారు. తాజాగా బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.

ఈ విషయాన్ని సీఎం రమేష్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. అయితే తాను కరోనా పరీక్షలు చేసుకోగా కరోనా పాజిటివ్ గా తేలిందన్నారు. కరోనా సోకినా తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని తెలిపారు. వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్ లోహోమ్ ఐసోలేషన్ లో ఉండి తాను చికిత్స తీసుకుంటున్నానని త్వరలోనే కోలుకుంటానన్నారు.

Related News