logo

  BREAKING NEWS

గుడ్ న్యూస్‌: క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ వచ్చేసింది..!  |   వైఎస్సార్‌, చంద్ర‌బాబు స్నేహ‌బంధంపై సినిమా  |   క‌రోనా ఖతం అయ్యే డేట్ చెప్పిన బిల్ గేట్స్‌  |   నిజంగానే పాపం త‌గిలిన‌ట్లుంది… క‌రోనాతో ఆ ఎస్సై మృతి  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వల్ల కూడా ఆ ప‌ని కాదు.. కొడాని నాని హాట్ కామెంట్స్‌  |   బ్రేకింగ్‌: మాజీ రాష్ట్ర‌ప‌తికి క‌రోనా పాజిటీవ్‌  |   క‌న్న‌డ దంప‌తుల ధైర్యం… పీఓకేలోని శార‌దాపీఠం నుంచి అయోధ్య‌కు ప‌విత్ర మ‌ట్టి  |   పాక్ నుంచి వ‌చ్చిన ఒకే కుటుంబంలో 11 మంది ఆత్మ‌హ‌త్య‌  |   విజ‌య‌వాడ కోవిడ్ సెంట‌ర్‌లో అగ్ని ప్ర‌మాదానికి కార‌ణాలివే..!  |   ప్లాస్మా దానం అంటే ఏమిటి ? ఎవ‌రు చేయాలి ? ఎలా చేయాలి ?  |  

ఎవరికి కరోనా వచ్చినా ‘గాంధీ’నే.. మంత్రులకు మాత్రం ప్రైవేటు ఆసుపత్రులా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మండిపడ్డారు. ఇటీవల తెలంగాణ హోమ్ మంత్రి మహమూద్ ఆలీకి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అయన వయసు, ఆస్తమా వ్యాధి దృష్ట్యా ముందు జాగ్రత్తగా ఆయనను అపోలో ఆపత్రిలో చేర్చి వైద్యం అందిస్తున్నామని కుటంబ సభ్యులు తెలిపారు. దీనిపై రాజాసింగ్ ప్రభుత్వాన్ని నిలదీశారు.

ఎవరికి కరోనా వచ్చిన గాంధీ ఆసుపత్రిలోనే వైద్యం తీసుకోవాలని గతంలో కేసీఆర్ వ్యాఖ్యానించారు. కానీ తెలంగాణ మంత్రులకు, స్పీకర్ కు మాత్రం ప్రభుత్వాసుపత్రులపై నమ్మకం లేనట్టుంది. అందుకే ప్రైవేటుకు పరుగు పెట్టారు. వారిని కూడా గాంధీలో చేర్చి వైద్యం అందించాలి అని డిమాండ్ చేసారు. ‘కేసీఆర్ గారూ ఫామ్ హౌస్ నుంచి ఇప్పటికైనా బయటకు రండి. పొరుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరిగితే హోటల్స్ ను, మాల్స్ ను ఆసుపత్రులుగా మార్చి వైద్యం అందిస్తున్నారు. 4 కోట్ల జనాభా ఉన్న తెలంగాణాలో మాత్రం ఒకే ఆసుపత్రి ఉంది’ అని రాజా సింగ్ అన్నారు.

ముఖ్యంమత్రి గారూ తెలంగాణ ప్రజలను చంపకండి. పేదవారు, సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఆసుపత్రుల్లో కరోనా రోగుల మృతదేహాలను తారుమారు చేస్తున్నారు. 15 రోజులైనా మృతదేహాలు దొరకడం లేదని వాపోతున్నారు. అంటూ రాజా సింగ్ ఓ వీడియో సందేశం ద్వారా వ్యాఖ్యానించారు.

Related News