logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

ఇదేంద‌య్యా..? మోడీపై ఆ ఎమ్మెల్యేకు ముదిరిన భ‌క్తి

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీపై ఓ బీజేపీ ఎమ్మెల్యేకు అభిమానం ముదిరి భ‌క్తిగా మారింది. దీంతో ఏకంగా మోడీ పేరుతో హార‌తి మంత్రాలు రాసేసి ప్ర‌తీరోజూ పూజ చేస్తున్నారు. లాక్ డౌన్ త‌ర్వాత మోడీకి గుడి కూడా క‌ట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఉత్త‌రాఖండ్‌కు చెందిన బీజేపీ ఎమ్మ‌ల్యే గ‌ణేష్ జోషికి ప్ర‌ధాని మోడీ అంటే విప‌రీత‌మైన అభిమానం. ఈ అభిమానం క్ర‌మంగా భ‌క్తిగా ముదిరింది. దీంతో హ‌నుమాన్ హార‌తి మంత్రాన్ని మోడీ హార‌తి మంత్రంగా రాశారు.

ఈ నెల 22న ఉత్త‌రాఖండ్‌లో ఓ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం కూడా నిర్వ‌హించి ఈ హార‌తి మంత్రాన్ని విడుద‌ల చేశారు. ఆ రాష్ట్ర ఉన్న‌త విద్యాశాఖ మంత్రి ధ‌న్‌సింగ్ రావ‌త్ కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. పూర్తిగా మోడీని కీర్తిస్తూ ర‌చించి ఈ హార‌తిలో జ‌మ్మూ క‌శ్మీర్‌లో ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు నుంచి అమెరికాకు హైడ్రాక్సీక్లోరోక్విన్ సర‌ఫ‌రా చేసిన సంఘ‌ట‌న‌ల‌ను జోడించారు. దేశంలో అవినీతిని మోడీ అంత‌మొందిస్తున్నార‌ని, ఉగ్ర‌వాదంతో పోరాడుతున్నార‌ని కీర్తిస్తూ ఈ మోడీ మంత్రం ఉంది.

ఈ విష‌యంపై స‌ద‌రు ఎమ్మెల్యే స్పందిస్తూ… త‌న‌కు మోడీనే భ‌గ‌వంతుడ‌ని, ఆయ‌న‌ను ప్ర‌తీ రోజూ పూజిస్తే పాజిటీవ్ ఎన‌ర్జీ వ‌స్తుంద‌ని అంటున్నారు. మోడీని పూజిస్తే త‌ప్పేంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. క‌రోనా వైర‌స్ సంక్షోభం ముగిశాక మోడీకి గుడి కూడా క‌ట్ట‌బోతున్న‌ట్లు చెప్పారు. మోడీ ప్ర‌తీరోజూ 18 గంట‌ల‌కు క‌ష్ట‌పడ‌తున్నార‌ని, ఆయ‌న‌కు ఈ విధంగా గౌర‌వం ఇస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, ఈ వ్య‌వ‌హారంపై ఉత్త‌రాఖండ్ ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందిస్తోంది. మ‌త మ‌నోభావాలు దెబ్బ‌తీసేలా బీజేపీ వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని కాంగ్రెస్ నేత‌లు ఆరోపిస్తున్నారు. బీజేపీ నేత‌లు అంధ భ‌క్తులని మ‌రోసారి రుజువైందంటున్నారు.

Related News