logo

  BREAKING NEWS

చంద్ర‌బాబు స‌వాల్‌కు సై అంటున్న జ‌గ‌న్‌..? రెఫ‌రెండంకు సిద్ధం.?  |   టీడీపీ – వైసీపీ వ‌ర్గాల మ‌ధ్య చిచ్చుపెట్టిన ఆష్టాచెమ్మా ఆట‌..!  |   తెలంగాణ‌లో మ‌రో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి క‌రోనా పాజిటీవ్‌  |   పంతం నెగ్గించుకున్న నిమ్మ‌గ‌డ్డ‌.. మ‌ళ్లీ కుర్చీలోకి..!  |   ఆవిరి పీలిస్తే క‌రోనా వైర‌స్ చ‌నిపోతుందా..? అస‌లు నిజం ఇది..!  |   బ్రేకింగ్: కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్!  |   బోది ధ‌ర్ముడిని చంపేశారా..? మ‌రి సైనికుడికి క‌నిపించింది ఎవ‌రు..?  |   విశాఖ షిప్ యార్డు బాధితులకు భారీ సాయం ప్రకటించిన ప్రభుత్వం  |   రాజధానిపై ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు..!  |   బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్య‌వ‌ర్గాన్ని ప్ర‌క‌టించిన బండి సంజ‌య్‌  |  

జ‌గ‌న్‌కు గుడ్ న్యూస్‌.. మూడు రాజ‌ధానుల‌పై క్లారిటీ ఇచ్చిన బీజేపీ..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానికి సంబంధించి గ‌త ఏడు నెల‌లుగా రాష్ట్రంలో రాజ‌కీయ ర‌చ్చ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. అమ‌రావ‌తి మాత్ర‌మే రాజ‌ధానిగా ఉండాలంటూ అమ‌రావ‌తి కోసం భూములు ఇచ్చిన రైతులు ఆందోళ‌న చేస్తున్నారు. వీరికి తెలుగుదేశం పార్టీ ప్ర‌ధానంగా మ‌ద్ద‌తు ఇస్తోంది. ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి రైతుల‌కు ప్ర‌ధాన మ‌ద్ద‌తుదారుడు. ఆయ‌న‌ క‌లల రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రా‌‌ధాన్యాన్ని త‌గ్గిస్తూ విశాఖ‌, క‌ర్నూలును కూడా రాజ‌ధానులుగా చేయ‌డాన్ని చంద్ర‌బాబు నాయుడు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు.

ఇదే స‌మ‌యంలో బీజేపీలోని నాయ‌కులు రాజ‌ధాని అంశంపై భిన్న వైఖ‌రులు అవ‌లంభిస్తున్నారు. మొన్న‌టి వ‌ర‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప‌ని చేసిన క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ అమ‌రావ‌తిలో మాత్ర‌మే రాజ‌ధాని ఉండాల‌ని ప‌ట్టుప‌ట్టారు. ఆయ‌న‌తో పాటు టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజ‌నా చౌద‌రి వంటి వారు సైతం మూడు రాజ‌ధానుల‌ను వ్య‌తిరేకిస్తున్నారు. బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా అమ‌రావ‌తిలోనే రాజ‌ధాని ఉండాలంటున్నారు. ఈ నేప‌థ్యంలో కేంద్రం ఈ వ్య‌వ‌హారంలో జోక్యం చేసుకుంటుంద‌ని వీరు బ‌లంగా న‌మ్ముతున్నారు.

స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు రాజ‌ధాని వ్య‌వ‌హారంలో కేంద్రం త‌ప్ప‌కుండా జోక్యం చేసుకుంటుంద‌ని, అమ‌రావ‌తి నుంచి రాజ‌ధాని ఒక్క అడుగు కూడా క‌ద‌ల‌ద‌ని సుజ‌నా చౌద‌రి ప‌దే ప‌దే ప్ర‌క‌ట‌న‌లు ఇస్తున్నారు. చంద్ర‌బాబు నాయుడు స‌హా టీడీపీ నేత‌లు కూడా ఇదే న‌మ్మ‌కం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌ధాని మోడీ శంకుస్థాప‌న చేసిన అమ‌రావ‌తినే రాజ‌ధానిగా ఉంటుంద‌ని, కేంద్రం కూడా జోక్యం చేసుకుంటుంద‌నేది వారి న‌మ్మకం. అంతేకాదు, రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం మూడు రాజ‌ధానులు చేయాలంటే కేంద్రం ఆమోదం త‌ప్ప‌నిస‌రి అని టీడీపీ సీనియ‌ర్ నేత‌, రాజ్యాంగ నిపుణుడిగా భావించే య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు చెబుతున్నారు.

అయితే, రాజ‌ధానిపై ఇప్పుడు బీజేపీ పూర్తి క్లారిటీ ఇచ్చేసింది. రాష్ట్ర రాజ‌ధాని ఎక్క‌డ ఉండాల‌నేది రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌రిధిలోని అంశమ‌ని తేల్చేసింది. అంతేకాదు, రాజ‌ధాని వ్య‌వ‌హారంలో కేంద్రం జోక్యం చేసుకుంటుంద‌ని సుజ‌నా చౌద‌రి చేసిన వ్యాఖ్య‌లు పార్టీ విధానానికి వ్య‌తిరేక‌మ‌ని స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు బీజేపీ రాష్ట్ర శాఖ రాజ‌ధానిపై పార్టీ విధానాన్ని స్ప‌ష్టం చేస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు మూడు రాజ‌ధానుల‌ను వ్య‌తిరేకిస్తున్న నేత‌ల‌కు షాక్ ఇచ్చింది. రాజ‌ధాని విష‌యంలో కేంద్రం జోక్యం చేసుకోద‌ని ఏపీ బీజేపీ కొత్త అధ్య‌క్షుడు సోము వీర్రాజు చేసిన ప్ర‌క‌ట‌న‌నే త‌మ పార్టీ విధాన‌మ‌ని ఈ ట్వీట్‌లో తేల్చేశారు.

దీంతో రాజ‌ధాని వ్య‌వ‌హారంలో కేంద్ర ప్ర‌భుత్వం జోక్యం చేసుకునేది ఉండ‌ద‌నేది స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇది చంద్ర‌బాబు, సుజ‌నా చౌద‌రి వంటి వారికి ఊహించ‌ని ప‌రిణామంగా చెప్పుకోవ‌చ్చు. ఇదే స‌మ‌యంలో మూడు రాజ‌ధానుల బిల్లును ఆమోదించ‌వ‌ద్ద‌ని గ‌వ‌ర్న‌ర్‌కు లేఖ రాసిన క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ను బీజేపీ రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి తొల‌గించ‌డం కూడా ఆస‌క్తిక‌రంగా మారింది. మొత్తంగా రాజ‌ధాని విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యంలో కేంద్రం జోక్యం చేసుకునే ఛాన్స్ లేదు. ఇప్ప‌టికే గ‌వ‌ర్న‌ర్‌కు మూడు రాజ‌ధానుల బిల్లుల‌ను పంపించింది రాష్ట్ర ప్రభుత్వం. గ‌వ‌ర్న‌ర్ ఆమోదం పొందితే రాజ‌ధాని వికేంద్రీక‌ర‌ణ బిల్లు చ‌ట్టంగా మారుతుంది. హైకోర్టు కూడా ఈ వ్య‌వ‌హారంలో జోక్యం చేసుకోక‌పోతే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు మూడు రాజ‌ధానులు ఏర్పాటు కావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

Related News