logo

  BREAKING NEWS

క‌రోనా బాధితుల‌కు గ్రీన్ ఫంగ‌స్ ముప్పు..లక్ష‌ణాలు, జాగ్ర‌త్త‌లు ఇవే  |   FACK CHECK: క‌రోనా వ్యాక్సిన్ వేసుకుంటే శ‌రీరం అయ‌స్కాంతం అవుతుందా ?  |   కేతిరెడ్డికి జ‌గ‌న్ బంప‌ర్ ఆఫర్.. షాక్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు  |   క‌రోనా వ్యాక్సిన్ వేసుకున్నాక ఈ ప‌నులు అస్స‌లు చేయ‌కండి  |   గుడ్ న్యూస్‌.. ఆ వ్యాక్సిన్ సామ‌ర్థ్యం 90 శాతం  |   నెయ్యి తింటే లావుగా అవుతారా ? నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాదా ?  |   అరుదైన రికార్డు సొంతం చేసుకోనున్న బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి  |   కేసీఆర్ మాస్ట‌ర్‌స్ట్రోక్‌.. హుజురాబాద్‌లో ఈట‌లకు క‌ష్ట‌మే  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వేరు జెండా.. కుప్పంలో కొత్త డిమాండ్‌  |   పెట్రోల్‌లో 20 శాతం ఇథ‌నాల్‌.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర.. మ‌రెన్నో లాభాలు  |  

క‌రోనా వ్యాక్సిన్ కావాలంటే బీజేపీకే ఓటేయాలా ?

క‌రోనా వైర‌స్‌తో ప్ర‌జ‌ల్లో నెల‌కొన్న భ‌యాందోళ‌న‌ల‌ను, వ్యాక్సిన్ ప‌ట్ల ప్ర‌జ‌ల్లో ఉన్న ఆశ‌ల‌ను ఎన్నిక‌ల కోసం ఉప‌యోగించుకునేందుకు అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్ర‌య‌త్నిస్తున్న విష‌యం తెలిసిందే. అంద‌రికంటే ముందు క‌రోనా వ్యాక్సిన్ అమెరిక‌న్ల‌కే వ‌స్తుంద‌ని ఆయ‌న ప‌దే ప‌దే ప్ర‌క‌ట‌న‌లు ఇస్తూ ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఇప్పుడు ట్రంప్ బాట‌లోనే మ‌న దేశంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ న‌డుస్తోంది. అమెరికాలోనే కాదు మ‌న ద‌గ్గ‌ర కూడా భార‌తీయ జ‌న‌తా పార్టీ క‌రోనా వ్యాక్సిన్‌ను ఎన్నిక‌ల్లో ఓట్లు రాబ‌ట్టేందుకు ఉప‌యోగించుకుంటోంది. బిహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించిన మేనిఫెస్టోలో ఈ హామీని చేర్చింది. త‌మ‌ను గెలిపిస్తే బిహారీలంద‌రికీ ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్ ఇస్తామ‌ని హామీ ఇచ్చారు.

బిహార్ ఎన్నిక‌ల బీజేపీ మేనిఫెస్టోను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ విడుద‌ల చేశారు. పాంచ్ సూత్ర‌, ఏక్ ల‌క్ష్య‌, 11 సంక‌ల్ప్ పేరుతో ఈ మేనిఫెస్టోను రూపొందించారు. ఈ మేనిఫెస్టోలోనే క‌రోనా వ్యాక్సిన్‌కు సంబంధించి కూడా ఓ ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన హామీని ఇచ్చింది బీజేపీ. బిహార్ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ అధికారంలోకి వ‌స్తే ఐసీఎంఆర్ చేత అనుమ‌తి పొందిన క‌రోనా వ్యాక్సిన్‌ను ప్ర‌తి బిహారీకి ఉచితంగా అందిస్తామ‌ని హామీ ఇచ్చారు.

ఈ హామీపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ప్ర‌తిప‌క్షాలు, నెటిజ‌న్ల‌తో పాటు వైద్య నిపుణులు సైతం ఈ హామీని త‌ప్పుబ‌డుతున్నారు. త‌మ పార్టీ గెలిస్తే బిహారీలంద‌రికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామ‌నే ప్ర‌క‌ట‌న చూస్తే మిగ‌తా రాష్ట్రాల్లోని ప్ర‌జ‌లకు ఉచితంగా ఇవ్వ‌రా అని ప్ర‌శ్నిస్తున్నారు. అస‌లు క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ ఇంకా ప్రయోగాల దిశ‌లోనే ఉంది. ఈ వ్యాక్సిన్ రావ‌డానికి మ‌రో ఆరు నెల‌ల నుంచి ఏడాది స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు.

అస‌లు వ్యాక్సిన్ క‌చ్చితంగా వ‌స్తుంద‌ని, వ‌చ్చిన వ్యాక్సిన్ 100 శాతం ప‌ని చేస్తుంద‌ని కూడా ఎవ‌రూ క‌చ్చితంగా చెప్ప‌లేరు. ఎందుకంటే, ఇప్ప‌టికే వ్యాక్సిన్‌లు లేని వైర‌స్‌లు అనేక ఏళ్లుగా మాన‌వాళిపైన దాడి చేస్తూనే ఉన్నాయి. ఎప్పుడు వ‌స్తుందో, ఎలా ప‌ని చేస్తుందో తెలియ‌ని వ్యాక్సిన్‌ను ఉచితంగా ఇస్తామ‌ని, త‌మ‌ను గెలిపిస్తేనే ఇస్తామ‌ని ఎన్నిక‌ల్లో ఒక రాష్ట్రానికే చెందిన ప్ర‌జ‌లు హామీ ఇవ్వ‌డాన్ని ప్ర‌తిప‌క్షాలు తప్పుప‌డుతున్నాయి.

తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ఇన్‌డైరెక్ట్‌గా ఈ విష‌యంపై స్పందించారు. క‌రోనా వ్యాక్సిన్ గురించి ఓ నెటిజ‌న్ అడిగిన ప్ర‌శ్న‌కు కేటీఆర్ స్పందిస్తూ వ్యాక్సిన్‌ను అప్పుడే బిహార్‌కు రిజ‌ర్వ్ చేశార‌ని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేత‌లు అయితే ఈ హామీపైన ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేయాల‌ని భావిస్తున్నారు. మరోవైపు నెటిజ‌న్లు కూడా బీజేపీ క‌రోనా వ్యాక్సిన్ హామీని తీవ్రంగా తప్పు‌బ‌డుతున్నారు.

Related News