logo

  BREAKING NEWS

మాజీ మంత్రి అఖిల ప్రియ కేసులో కొత్త మలుపు!  |   నువ్వు దేవుడివి సామీ.. 1020 మంది చిన్నారుల‌కు ప్రాణాలు పోసిన మ‌హేష్  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌ను టెన్ష‌న్ పెడుతున్న త్రివిక్ర‌మ్‌  |   తొలి టీకా పై వెనక్కి తగ్గిన ఈటెల.. కారణం ఇదే!  |   తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్ర మంత్రి లేఖ.. కీలక ఆదేశాలు!  |   వాక్సిన్ వికటించి 23 మంది మృతి.. మరో 23 మందికి అస్వస్థత!  |   వాక్సిన్ తీసుకున్నవారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి: కేంద్రం కీలక వ్యాఖ్యలు!  |   ఇది విన్నారా..? కుంబాల గోత్రం.. ఆర్త్రా న‌క్ష‌త్రం.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి  |   ఏ వయసు వారికి టీకా వేస్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  |   జనగామకు బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఉద్రిక్త వాతావరణం  |  

డబ్బులు పంచుతున్నారని.. మంత్రి పువ్వాడ వాహనం పై దాడి!

గ్రేటర్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. కూకట్పల్లిలోని ఫోరమ్ మాల్ దగ్గర టీఆర్ఎస్ నేతలు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వాహనాన్ని అడ్డుకున్నారు. ఆయన వాహనంలో వచ్చి టీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారని మంత్రి వాహనంపై దాడి చేసారు.

కాగా ఆ సమయంలో కారులో మంత్రి లేరు. దీంతో బీజేపీ- టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఓ టీఆర్ఎస్ కార్యకర్తపై బీజేపీ వారు దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే కృష్ణారావు బీజేపీ కార్యకర్తలు కావాలనే గొడవకు దిగుతున్నారని ఆరోపించారు. కూకట్ పల్లి, బాలాజీ నగర్ ప్రాంతాల్లో బీజేపీ రౌడీ షీటర్లకు టికెట్లు ఇచ్చిందన్నారు. వారు పోలింగ్ ను ప్రశాంతంగా జరగనివ్వకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఓటర్లంతా బయటకు వచ్చి పోలింగ్ లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

Related News