logo

  BREAKING NEWS

‘దమ్ముంటే కూల్చరా’.. అక్బరుద్దీన్ కు బండి సంజయ్ సవాల్!  |   మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే వారిని తరిమికొడతాం .. పాతబస్తీపై బండి సంచల వ్యాఖ్యలు  |   కరోనా సెకండ్ వేవ్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!  |   మహిళల భద్రతకు ‘అభయం’ యాప్.. ఎలా పనిచేస్తుంది? ప్రత్యేకతలేమిటి?  |   తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకుందాం: కేసీఆర్  |   హైద్రాబాదులో గుంతలు లేని రోడ్డు చూపిస్తే రూ. లక్ష..!  |   భాగ్యనగరవాసులకు అలెర్ట్: ముంచుకొస్తున్న భారీ ముప్పు!  |   జీహెచ్ఎంసీ ఎన్నికలపై పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన..!  |   శత్రుదేశాలకు నిద్రలేకుండా చేసే చైనా రహస్యం.. ‘ఐదు వేళ్ళ వ్యూహం’ గురించి తెలుసా?  |   హైదరాబాద్ పాత బస్తీలో హైటెన్షన్.. భారీగా పోలీసుల బందోబస్తు!  |  

టీవీ9 కు బిత్తిరి సత్తి రాజీనామా.. కారణం అదేనా?

బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవికుమార్. ఈ పేరు చెబితే చాలు చాలా మంది తెలుగు ప్రజల ముఖాల్లో నవ్వులు విరబూస్తాయి. తనదైన శైలి యాసతో విలక్షణమైన హావభావాలను పలికిస్తూ అతను చెప్పే వార్తలకు బుల్లితెర ప్రేక్షకులంతా అభిమానులయ్యారు. ఓ సాధారణ యాంకర్ గా కెరీర్ స్టార్ చేసిన సత్తి తన అసలు ప్రయాణాన్ని మాత్రం సత్తి v6 ఛానెల్ ద్వారానే మొదలు పెట్టాడు.

ఆ తర్వాత టీవీ9 బిత్తిరి సత్తికి భారీ ఆఫర్ ఇవ్వడంతో v6కి గుడ్ బై చెప్పి టీవీ 9లో ఇస్మార్ట్ న్యూస్ పేరుతో కొత్త ప్రోగ్రాం ప్రారంభించాడు. అయితే ఇస్మార్ట్ న్యూస్ పేరుతో పాత ఫార్ములానే కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని మొదట్లో కామెంట్స్ వినిపించాయి. మెల్లిగా ఇస్మార్ట్ న్యూస్ ను కూడా ప్రేక్షకులు ఆదరించడం మొదలుపెట్టారు. టీవీ9 టాప్ రేటెడ్ ప్రోగ్రామ్స్ లో ఇస్మార్ట్ న్యూస్ ప్రధానంగా కొనసాగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో బిత్తిరి సత్తిని టీవీ 9 యాజమాన్యం తొలగించినట్టుగా వార్తలు రావడం తెలుగు మీడియా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

కొంత కాలంగా ఛానల్ యాజమాన్యానికి సత్తికి మధ్యన మనస్పర్థలు తలెత్తాయని, స్కిట్ల విషయంలో బిత్తిరి సత్తి తన వ్యక్తిగత విషయాలు ప్రస్తావించడం ఛానల్ కు ఏమాత్రం నచ్చలేదనేది ప్రధాన కారణంగా వినిపిస్తుంది. ఈ విషయంపై యాజమాన్యం పలుసార్లు హెచ్చరించినా కూడా అతనూ పట్టించుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందట. ఇస్మార్ట్ న్యూస్ పాపులర్ అవుతుండటంతో రెమ్యునరేషన్ ను కూడా భారీగా పెంచాలని సత్తి డిమాండ్ చేసాడని, స్కిట్ల విషయంలో కూడా ఇష్టానుసారంగా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడనే కారణాలు బయటకు వినిపిస్తున్నాయి.

ఆయనతో పాటు ఈ ప్రోగ్రామ్‌కు ప్రొడ్యూసర్‌గా వ్యవహరంచే మరో వ్యక్తిని కూడా యాజమాన్యం తొలిగించనట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు టీవీ 9 యాజమాన్యం ఒత్తిడి, వాళ్ల కండిషన్స్ తట్టుకోలేక బిత్తిరి సత్తి బయటకు వచ్చేశాడనే కామెంట్స్ కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. బిత్తిరి సత్తిని తొలగించడానికి బిగ్ బాస్ రియాలిటీ షో కూడా ఓ కారణమని కొందరి వాదన. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. బిత్తిరి సత్తి ఈ షో లో పాల్గొనవలసి ఉండగా అందుకు యాజమాన్యం అంగీకరించలేదని, అందుకే స్టార్ మా అఫర్ ను వదులుకోలేక టీవీ 9 ను వదిలేశాడని తెలుస్తుంది.

Related News