బిత్తిరి సత్తి పేరుతొ తెలుగు రాష్ట్రల్లో మంచి గుర్తింపు సంపాదించాడు చేవెళ్ల రవి. మొదట v6 ఛానెల్ తో ప్రయాణం మొదలు పెట్టిన సత్తి ఆ తర్వాత విబేధాల కారణంగా టీవీ9 లో ‘ఇస్మార్ట్ న్యూస్’ పేరుతో ఓ కార్యక్రమా చేసాడు. అది కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. ఊహించని విధంగా సత్తి టీవీ 9 ఛానెల్ నుంచి కూడా తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది.
కాగా సత్తి రియాలిటీ షో అయిన బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. గత సీజన్ లో బిగ్ బాస్ శివ జ్యోతికి ఈ షోలో అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారి సత్తిని తీసుకుంటే షోకి భారి హైప్ వాటిస్తుందని యాజమాన్యం భావిస్తుందని వార్తలు వినిపించాయి. అందుకోసం సత్తికి గతంలో శ్రీ ముఖికి ముట్టజెప్పిన దాని కన్నా కూడా భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారట.
ఈ వార్తలపై సత్తి ఇప్పటివరకు స్పందించలేదు. ఇదిలా ఉంటె ఇప్పుడు బిత్తిరి సత్తి మరోసారి వార్తల్లో నిలిచాడు. ప్రముఖ వార్తా ఛానెల్ సాక్షి ఛానెల్ నుంచి సత్తికి పిలుపు అందింది అని సమాచారం. ఇక త్వరలోనే సాక్షి టీవీలో మరో కొత్త కార్యక్రమంతో బుల్లి తెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే.