logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

ఒక్క బ‌ర్త్‌డే పార్టీ… 45 మందికి క‌రోనా వైర‌స్‌

లాక్‌డౌన్ ఉల్లంఘించి నిర్వ‌హించిన పుట్టున రోజు వేడుక‌ల వ‌ల్ల 45 మందికి క‌రోనా వైర‌స్ సోకింది. మ‌న‌కేమీ కాదులే అనే అల‌స‌త్వం ఎంత న‌ష్టం చేస్తుందో చెప్పే ఉదాహ‌ర‌ణ ఇది. హైద‌రాబాద్‌లోని మ‌ల‌క్‌పేట గంజ్‌లో ఓ దుకాణ‌దారుడికి త‌న వ‌ద్ద ప‌ని చేసే మ‌నిషి ద్వారా క‌రోనా వైర‌స్ సోకింది. ఈ విష‌యాన్ని ఇంకా బ‌య‌ట‌ప‌డ‌క‌ముందే తోటి దుకాణ‌దారుడు, స్నేహితుడైన ఓ వ్య‌క్తి పుట్టిన రోజు వేడుక‌ల‌ను వ‌న‌స్థ‌లిపురంలో నిర్వ‌హించాడు.

ఈ కార్య‌క్ర‌మానికి ప‌లువురు స్నేహితులు, కుటుంబ‌స‌భ్యులు హాజ‌ర‌య్యారు. ఈ వేడుక‌లో క‌రోనా వైర‌స్ వ్యాపించింది. దీంతో ఇద్ద‌రు దుకాణ‌దారుల కుటుంబాలు, బంధువు‌ల్లోనే 25 మందికి క‌రోనా వైర‌స్ సోకింది. వీరంతా ఎల్‌బీన‌గ‌ర్‌, వ‌న‌స్థ‌లిపురం, స‌రూర్‌న‌గ‌ర్ ప్రాంతాల‌కు చెందిన వారే. దీంతో ఎల్‌బీన‌గ‌ర్ ప్ర‌స్తుతం క‌రోనా హాట్ స్పాట్‌గా మారిపోయింది. ఇంత‌కుముందు ఎల్‌బీన‌గ‌ర్‌లో కేవ‌లం రెండు కంటైన్‌మెంట్ జోన్లు మాత్ర‌మే ఉండ‌గా ఈ బ‌ర్త్‌డే పార్టీ వ‌ల్ల 15 క్ల‌స్ట‌ర్లు ఏర్పాట‌య్యాయి.

వీరి ద్వారా ఇంకా ఎవ‌రెవ‌రికి క‌రోనా సోకింది, వీరు ఇంకా ఎవ‌రెవ‌రిని క‌లిశార‌నేది తేల్చే ప‌నిలో అధికార యంత్రాంగం ప‌డింది. కంటైన్‌మెంట్ క్ల‌స్ట‌ర్‌ల‌లో అంద‌రినీ హోం క్వారంటైన్ చేశారు. ఇలా, ఓ వ్య‌క్తి అల‌స‌త్వానికి త‌న స్నేహితులు, కుటుంబ‌స‌భ్యులు, బంధువులు, చుట్టుప‌క్క‌ల వారు అంతా ఇబ్బంది ప‌డుతున్నారు. కాబ‌ట్టి, కొన్నాళ్ల వ‌ర‌కు ఇటువంటి వేడుక‌ల‌కు దూరంగా ఉంటే మంచిది.

Related News